బుల్లి పిట్ట: మళ్లీ లాంచ్ చేయబోతున్న ఒకప్పటి నోకియా మొబైల్స్..!!

Divya
గడిచిన 15 సంవత్సరాల క్రితం ఎక్కువగా నోకియా పాత మోడల్స్ మొబైల్స్ ని ఎక్కువగా ఇష్టపడేవారు.. నోకియా సంస్థ నుంచి నోకియా మళ్లీ ఇప్పుడు అలాంటి మొబైల్స్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది నోకియా 130, నోకియా 150 మోడల్స్ లో రెండు ప్రసిద్ధమైన మొబైల్స్ ని లాంచ్ చేయడం జరుగుతోంది. అది కూడా అధునాతన సాఫ్ట్వేర్ తో పాటు స్నేక్ గేమ్ ని కూడా అందించబోతోంది. నోకియా ఫీచర్ ఫోన్లలో స్నేక్ గేమ్ ఆడే రోజులను మళ్ళీ గుర్తుకు తెచ్చేలా చేస్తాది ఈ సంస్థ.


స్మార్ట్ మొబైల్ లేని రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం చాలా తేలికగా గడిచిపోయేది.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం ఎక్కువగా నడుస్తోంది. మనం కూర్చున్న దగ్గర నుంచి అన్ని పనులు పూర్తి చేసుకోవడంలో సహాయపడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ మొబైల్స్ వ్యాసనానికి  దారి తీసేలా చేస్తున్నాయి.. దీంతో పాత మొబైల్స్ ని కొనాలనుకునే వారికి నోకియా సంస్థ నోకియా 130,150 ఫోన్లను తీసుకురావడం జరుగుతోంది పాత ఫోన్లు మళ్ళీ లాంచ్ ఏంటనే విషయంపై అందరూ గందరగోళంగా ఉండవచ్చు.. నోకియా మొబైల్ ఈ రెండు మొబైల్స్ల ఎటువంటి హార్డ్వేర్ మార్పులు చేయలేదట.



కానీ సాఫ్ట్వేర్ మరియు దాని ఫీచర్స్ ని మాత్రమే అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది నోకియా 150 మొబైల్ ఫీచర్స్ మొత్తం మూడు రంగులలో అందుబాటులో ఉన్నది బ్యాటరీ విషయానికి వస్తే 1450mah సామర్థ్యంతో కలదు. ఈ బ్యాటరీ నెల వరకు స్టాండ్ భై అందిస్తుందట.2.4 అంగుళాల డిస్ప్లే కలదు. ఈ మొబైల్లో కెమెరా కూడా కలదు 0.3 mp కెమెరాతో లభిస్తుంది అలాగే ఎస్టీ కార్డు సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్లోని మీ మొత్తం డేటాను భద్రపరుచుకోవచ్చు.


ఈ మొబైల్స్ లో ఫీచర్స్ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్లు 12  కీప్యాడ్ తో ఫిజికల్ బటన్ మరియు ఆపరేటింగ్ సిస్టం కోసం నావిగేషన్ బటన్లను కూడా కలిగి ఉంటుంది. ఇందులో క్లాసిక్ గేమ్ స్నేక్ గేమ్ అప్డేట్ వర్షంతో వస్తుందట. అయితే దీని ధరలను ఇంకా తెలియజేయలేదు త్వరలోనే పూర్తి వివరాలను అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: