బుల్లి పిట్ట: మొబైల్ ద్వారా డెంగ్యూ జ్వరాన్ని చెక్ చేసుకోవచ్చు..!!

Divya
ఈ రోజుల్లో కాస్త జ్వరం రాగానే వైద్యుడు వద్దకు వెళుతూ ఉంటాము.. అయితే అక్కడ పలు రకాల టెస్టులు రాస్తూ ఉంటారు. అయితే ఈ సారి కాస్త జ్వరంగా ఉంటే డెంగ్యూ పరీక్షను మనం చేసుకోవచ్చని అది కూడా ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చట. దీని కోసం కేవలం స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుందట. మన శరీర ఉష్ణోగ్రతను కూడా తనిఖీ చేయగలిగే యాప్ ఒకటి ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ యాప్ ధర్మామీటర్ లాగా పని చేస్తుందట.

కచ్చితంగా మీ స్మార్ట్ మొబైల్ లో ఈ యాప్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను కొలవవచ్చు. డెంగ్యూ శరీరంలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. కొంతమంది యూనివర్సిటీ పరిశోధకులు స్మార్ట్ మొబైల్ ను ధర్మామీటర్ గా మార్చడానికి.. ఫీవర్ ఫోన్ యాప్ ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎలాంటి హార్డ్వేర్ కనెక్షన్ లేకుండా జ్వరాన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీ ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తుంది. అంతర్ర్ణిత సెన్సార్ పరికరం వద్దకు వచ్చే ఏదైనా వేడి వస్తువులను సైతం ఇది గుర్తిస్తుందట.

ఫీవర్ ఫోన్ యాప్ ని ఆన్ చేసి మీ నుదుటి మీద ఉంచితే చాలు మొబైల్ టచ్ చేసి స్క్రీన్ నుదురు ముందు ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.. తెరపై ఉష్ణోగ్రత మారినట్లు అయితే అప్పుడు కచ్చితంగా జ్వరం సంభవించినట్లు.. ఈ యాప్ కాకుండా ఇలా ఇంకా పలు రకాల యాప్స్ ఉన్నాయి.. బాడీ టెంపరేచర్ థర్మామీటర్ ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నది. దీనిని 10 లక్షల కు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా జ్వరం ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. బాడీ టెంపరేచర్ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో కలదు దీనిని 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: