బుల్లి పిట్ట: మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల సంఖ్య ఇలా తెలుసుకోండి..?
తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక వ్యక్తి పేరు మీద 658 సిమ్ కార్డులు యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది ఈ సిమ్ కార్డులన్ని కూడా టెలికాం అధికారులు బ్లాక్ చేసినట్లుగా సమాచారం.. ఈ నేపథ్యంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ తన రూల్స్ సరిత ఒక్కసారి అప్డేట్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఆంక్షలు ప్రకారం ఒక వినియోగదారుడు కేవలం 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలి అంతకంటే ఎక్కువగా ఎవరైనా కలిగి ఉంటే రి వెరిఫికేషన్కు ఆదేశిస్తారు.. దీంతో ఎవరు పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే అధికారులు సైతం సూచిస్తున్నారు.
మొదట గూగుల్ లో అధికారిక వెబ్సైట్ https:// sancharsaathi.gov.in/ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో నో మొబైల్ నెంబర్ కనెక్షన్..(TAFCOP) పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అయ్యాక అక్కడ పది అంకెల మొబైల్ నెంబర్ను మనం ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత కింద ఉన్న క్యాప్చుకోడును ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది.
అలా ఎంటర్ చేసిన వెంటనే మన పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయి తెలుస్తోంది .ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా నెంబర్లు తీసుకున్నచో బ్లాక్ చేసి అవకాశం ఉంటుందట.