స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పాడవకుండా ఈ టిప్స్ పాటించండి?

మన స్మార్ట్ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ అనేది ఎంత ముఖ్యమో ఇంకా అదే విధంగా బ్యాటరీ కూడా చాలా ముఖ్యం. స్మార్ట్‌ ఫోన్‌కు బ్యాటరీ ఎక్కువగా రావాలంటే ఖచ్చితంగా మనం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో 5000mAh నుంచి 7000mAh దాకా బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి.ఈ స్మార్ట్ ఫోన్ లు ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు విడుదలైన చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అందువల్ల కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుందన్నది నిజం. అయితే, సరిగ్గా మెయింటెన్‌ చేయకపోతే మాత్రం బ్యాటరీ కూడా చాలా వేగంగా చెడిపోతుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీ మొబైల్‌తో అందించిన ఛార్జర్ నుంచి స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేయండి. ప్రస్తుతం అన్ని మొబైల్స్ కూడా USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేయబడతాయి.


కంప్యూటర్‌లో పెట్టుకున్నా లేదా ఇతర కంపెనీల ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేసినా కూడా ఖచ్చితంగా సమస్య వస్తుంది. అందుకే కంపెనీ అందించిన ఛార్జర్ నుండి మాత్రమే ఛార్జ్ చేయండి. ఇక అప్పుడు బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. మొబైల్ వేడెక్కడం వల్ల బ్యాటరీపై కూడా ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది. ర్యామ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడితే మొబైల్ అనేది ఈజీగా వేడెక్కుతుంది. అందుకే వెంటనే గేమ్ ఆడటం మానేయండి. మొబైల్ చల్లబడే దాకా అస్సలు ఉపయోగించవద్దు.అలాగే వీలైనంత వరకు కారు లేదా బైక్ ఛార్జర్ల ద్వారా ఫోన్ బ్యాటరీని రీఛార్జ్ చేసే అలవాటును ఖచ్చితంగా మానుకోండి. ఎందుకంటే, దాని నుంచి అధిక కరెంట్ ఫోన్ బ్యాటరీపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొంతమంది తమ మొబైల్‌లను రాత్రిపూట ఎక్కువగా ఛార్జ్ చేసి ఉంచుతారు. ఇలా చేయడం ఖచ్చితంగా చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీని వల్ల బ్యాటరీ ఎక్కువ సేపు ఉండదు. అలాగే ఓవర్‌ఛార్జ్ కూడా చేయవద్దు. 90% ఛార్జ్ అయిన వెంటనే ఛార్జర్‌ను ఖచ్చితంగా ఆఫ్ చేయండి.ఇంకా అలాగే ఫోన్ బ్యాటరీ 20% కి తగ్గకముందే ఛార్జ్ పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: