భారత్‌కు అనుకూలంగా అమెరికా కీలక నిర్ణయం?
ఉదాహరణకు అమెరికా ఆయుధాలను అమ్ముతుంటుంది. కానీ ఆ ఆయుధాలని తయారు చేసే టెక్నిక్ మాత్రం తన దగ్గరే ఉంచుకుంటుంది. అదే విధంగా యుద్ధ విమానాలను అమ్ముతూ ఉంటుంది. కానీ వాటిని ఏ విధంగా తయారు చేయాలనే టెక్నాలజీ మాత్రం తన దగ్గరే ఉంచుకుంటుంది. అమెరికాకి సంబంధించిన ఈ విధానంతో దాని దగ్గర ఏదైనా కొన్న వాళ్ళు, అది ఆయుధాలు గానీ యుద్ధ విమానాలు గానీ కొన్న వాళ్లు వాటికి రిపేర్లు వస్తే తిరిగి అమెరికా దగ్గరికి రావాల్సి వస్తుంది.
కానీ తాజాగా మోడీ చేసిన అమెరికా టూర్ ఎఫెక్ట్ తో అక్కడ కీలకమైన ప్రక్రియ మొదలైందని చెప్పుకోవాలి. అయితే తాజాగా అమెరికా భారతదేశానికి తన యుద్ధ విమానాలకు సంబంధించిన తయారీని వివరించడానికి సిద్ధమైందని తెలుస్తుంది. భారత దేశంతో జెట్ ఇంజన్ ఒప్పందానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కాంగ్రెస్ తన సమ్మతాన్ని తెలిపింది. ఐ ఎఫ్ ఫైటర్ జెట్ లకు సంబంధించిన ఎఫ్414 ఇంజిన్ లను జీ.ఈ జనరల్ ఎలక్ట్రిక్ తో తయారు చేయడానికి రంగం సిద్ధమవుతుంది.
దాని కోసం హెచ్ ఏ ఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసే ఒప్పందంపై అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్రకారం యుఎస్ తాను మోస్ట్ ప్రెస్టీజియస్ గా భావించే జెట్ ఇంజన్ టెక్నాలజీని పంచుకోవడానికి అంగీకరించింది. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం తాలూకా చర్చలు జరగడం ఒక విశేషం.