బుల్లి పిట్ట: మరో సరికొత్త అప్డేట్ తో వాట్సాప్.. ఫీచర్ అదుర్స్..!!
అయితే ఈ వాట్సాప్ ఛానల్ అనేది ఎక్కడ మన యాప్ లో ఉంటుందనే విషయానికి వస్తే చాలా సింపుల్.. ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు వాట్సాప్ ఛానల్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అయితే వాట్సప్ లో అప్డేట్ చేసిన తర్వాత అక్కడ ఛానల్ లిస్టు చూపించబడుతుంది. అయితే ఎవరైనా కూడా ఈ వాట్సాప్ చానల్లో ఒక చానల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
.మొదట మీ మొబైల్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయాలి.. వాట్సప్ అప్డేటెడ్ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కష్టమైజ్ ఛానల్ లోకి వెళ్లి ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు.
అయితే ఈ అప్డేట్ ద్వారా నచ్చిన సెలబ్రిటీస్ అప్డేట్ సైతం నేరుగా పొందడానికి ఒక సురక్షితమైన దారిగా ఈ ఫీచర్ ఉంటుందని వాట్సప్ సంస్థ తెలియజేస్తోంది. అయితే మన ఇండియా నుంచి క్రికెట్ టీమ్ ,కత్రినా కైఫ్ అక్షయ్ కుమార్ ,విజయ్ దేవరకొండ వంటి వారు లాంచ్ చేశారు.
ప్రస్తుతానికి ఈ వాట్సప్ క్రియేట్ చేసుకునే అవకాశం కొన్ని దేశాలలో కొన్ని అకౌంట్ కి మాత్రమే లిమిట్ ఉన్నట్లుగా తెలియజేసింది వాట్సాప్ సంస్థ.