కస్టమర్ చేసిన పనికి.. యాపిల్ కంపెనీకి భారీ జరిమానా?
అయితే ప్రస్తుతం వినియోగదారులందరికీ కూడా అధునాతన ఫ్యూచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ అందించేందుకు ఎన్నో మొబైల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పోటీపడి మరి మంచి మంచి ఫీచర్లను అందిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని రకాల బ్రాండ్లు ఎంత మంచి ఫ్యూచర్లో ఇచ్చిన.. అటు యాపిల్ ఐఫోన్ కి ఉండే మార్కెట్ మాత్రం రోజురోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఏకంగా యాపిల్ ఫోన్ కలిగి ఉండడాన్ని ఒక ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తూ ఉంటారు కస్టమర్లు. అందుకే ఈ యాపిల్ ఫోన్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతూ ఉంటారు అని చెప్పాలి.
ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే ఐఫోన్ కొనుగోలు చేశాడు. కానీ ఆ తర్వాత అతను ఇబ్బందులు పట్టాడు. చివరికి ఇక వినియోగదారుల పోరంని ఆశ్రయిస్తే అతనికి ఐఫోన్ కంపెనీ భారీగా నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ఆవేజ్ ఖాన్ 2021 లో ఐఫోన్ 13 కొన్నాడు. కొన్ని నెలలకు అది బ్యాటరీ స్పీకర్ సమస్యలు రావడంతో సర్వీస్ సెంటర్ కి వెళ్ళాడు. ఏడు రోజుల్లో రిపేర్ చేసి ఇచ్చారు. అయిన ఫోన్ సరిగా పనిచేయడం లేదని చెప్పడంతో మరో 14 రోజులు వృధా చేసి రిపేర్ చేస్తున్నామని దానికి వెంటనే వారంటీ వర్తించదని చెప్పారు. దీంతో సదరు కస్టమర్ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. దీంతో యాపిల్ ఇండియా కంపెనీ 79,900 రూపాయలతో పాటు 20 వేల వడ్డీ కూడా చెల్లించాలి అంటూ వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.