ఫేమస్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ దూకుడు మాములుగా లేదు. ప్రతిరోజూ ఏదో ఒక అప్‌డేట్‌ను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది వాట్సాప్. ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునే నేపథ్యంలో కొంగొత్త ఫీచర్స్‌తో యూజర్లను చేజారకుండా వాట్సాప్ చూసుకుంటోంది.ముఖ్యంగా ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ రకరకాల అప్‌డేట్స్‌ను తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.మొన్నటి దాకా ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వచ్చిన వాట్సాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్స్‌ను అందించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో స్టిక్కర్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ డిజైన్ చేసిన స్టిక్కర్స్. కానీ ప్రస్తుతం వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన స్టిక్కర్స్‌ను ఈజీగా రూపొందించుకోవచ్చు. టెక్ట్స్‌ను స్టిక్కర్స్‌గా మార్చుకోవడం కూడా ఈ ఫీచర్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఇంగ్లిష్ టెక్ట్స్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తోంది. ఇక త్వరలోనే ఇతర భాషల్లోకి కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని దేశాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది.
త్వరలోనే ఈ ఫీచర్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ యాప్‌లో యూజర్లు మరింత మెరుగైన చాట్ అనుభూతిని పొందేందుకు ఈ ఏఐ స్టిక్కర్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్ మాతృ సంస్థ మెటా చెబుతోంది. యూజర్ల టెక్ట్స్ ప్రాంప్ట్స్‌ను మల్టిపుల్ యూనిక్ ఇంకా హై క్వాలిటీ స్టిక్కర్స్‌గా తమ ఏఐ టూల్ సెకండ్ల వ్యవధిలో మార్చేస్తుందని మెటా అధికారిక బ్లాగ్ పోస్ట్ తెలిపింది.ఇక ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఇప్పటికే బీటా టెస్టింగ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్‌లో ఏఐ స్టిక్కరస్‌ను మెటా అధికారికంగా లాంచ్ చేసింది. యూజర్లు టెక్ట్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ స్టిక్కర్స్ ట్రేలో కనిపిస్తాయి. వీటిని ఈజీగా మీకు నచ్చిన కాంటాక్ట్‌తో షేర్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం కోసం ముందుగా మనం వాట్సాప్‌లో చాట్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత మోర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. తరువాత క్రియేట్ సెలక్ట్ చేసి టెక్టస్ ప్రాంప్ట్‌ను ఇచ్చి కంటిన్యూపై నొక్కాలి. మీరు కోరుకుంటున్న స్టిక్కర్ డిస్క్రిప్షన్ ఇవ్వగానే నాలుగు స్టిక్కర్లు మీకు జనరేట్ అవుతాయి. చివరిగా ఆ స్టిక్కర్‌పై ట్యాప్ చేస్తే చాలు సెండ్ అవుతుంది.