బుల్లి పిట్ట: రూ.1299 లకే జియో నుంచి మరో సరికొత్త మొబైల్..!!
ఈ మొబైల్ కాస్త స్క్రీన్ పెద్దదిగా కనిపిస్తోంది.4G మొబైల్ అని కూడా గమనించవచ్చు. అయితే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకున్నట్లు అయితే.. jio Bharath B-1 యొక్క ధర విషయానికి వస్తే.. రూ.1,299 రూపాయలుగా ఉన్నది ఈ మొబైల్ జియో నుండి మరో తక్కువ ధరకే లభించే మొబైల్ అని కూడా చెప్పవచ్చు..2.4 అంగుళాల స్క్రీన్ కలదు..2000 MAH సామర్థ్యం కలిగిన బ్యాటరీ కలిగి ఉంటుంది ఈ మొబైల్ కొంచెం మెరుగైన విభాగంలో ఉండబోతోంది. జియో గత మొబైల్స్ తో పోలిస్తే ఈ మొబైల్ సామర్థ్యంలో కూడా కాస్త మెరుగుదల కనిపిస్తోంది.
మొబైల్లో కెమెరా అమర్చబడిన తీరని చూస్తే కెమెరా కూడా అద్భుతంగా ఉండేలా కనిపిస్తోంది..JIObharath B1 మొబైల్లో ఫ్రీ ఇన్స్టాల్ యాప్ లను ఆల్రెడీ ఇన్స్టాల్ చేయబడి వస్తుందట.. ఈ మొబైల్లో సినిమాలు వీడియోలు స్పోర్ట్స్ హైలెట్ చూడవచ్చు.. జియో భారత్ సిరీస్ లో 23 భాషలకు మద్దతు ఇస్తోందట. అయితే ఇందులో జియో సిమ్ కాకుండా మరి ఇతర సిమ్మును ఉపయోగించలేరు. ప్రస్తుతం ఈ మొబైల్ కేవలం నలుపు రంగు మాత్రమే అందుబాటులో ఉన్నది. ప్రతి ఇండియన్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడానికి జియో గత కొద్ది రోజుల క్రితం ఎయిర్ ఫైబర్ సేవలను కూడా ప్రారంభించింది.