బుల్లి పిట్ట: తక్కువ ధరకే జియో బుక్ ల్యాప్ టాప్..!!

Divya
రిలయన్స్ జియో సంస్థ జియో నెట్వర్క్ తో పాటు విద్యార్థులకు అవసరమైన ల్యాప్ టాప్ కూడా తమ బ్రాండ్ నుంచి విడుదల చేయడం జరిగింది. జియో బుక్ పేరిట ఒక ల్యాప్ టాప్ ను రిలీజ్ చేయడం జరిగింది.ఆ సమయంలో దీని ధర రూ.16,499 రూపాయలుగా ఉన్నది. ఈసారి దసరా పండుగ సీజన్లో లిమిటెడ్ ఆఫర్ కింద ల్యాప్ టాప్ ను భారీ డిస్కౌంట్తో ప్రకటించడం జరిగింది. ఈ కామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 రూపాయలు సైతం తగ్గింపు పొందవచ్చు.

అలాగే EMI ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫలితంగా అతి తక్కువ ధరకే jio BOOK ల్యాప్  టాప్ పొందే అవకాశం ఉంటుంది.. జియో బుక్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..ల్యాప్  టాప్ 4G కనెక్టివిటీ తో కలిగి ఉంటుంది. మరియు విద్యార్థులకు అవసరమైన విధంగా ఈ ల్యాప్  టాప్  ఉపయోగకరంగా ఉంటుందట.11.6 అంగుళాల హెచ్డి యాంటీ గ్లేర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. వీటితోపాటు మీడియా టెక్ ఆటో కోర్ ప్రాసెస్ ని కూడా కలిగి ఉంటుంది..4GB RAM+64 GB స్టోరేజ్ మెమోరీని కలిగి ఉంటుంది.

JIO BOOK ల్యాప్  టాప్ లో jio OS పైన ఆధారపడి పనిచేస్తుంది.. యాప్స్ ఎక్స్టెండెడ్ డిస్ప్లే టచ్ పాడ్ సహ మరిన్ని ఫీచర్లు కూడా కలవట. 8 గంటల బ్యాటరీ లైఫ్ తో ల్యాప్  టాప్ పనిచేస్తుంది. అలాగే ల్యాప్  టాప్ కు సైతం  4G సిమ్ కార్డును ఆల్రెడీ ఇన్ బుల్ట్ చేసి ఉంటుందట. అయితే వినియోగదారులు ఈ సిమ్ కార్డును జియో వెబ్సైట్ లేదా జియో యాప్స్ ద్వారా మాత్రమే యాక్టివేషన్ చేసుకొనేలా సదుపాయాన్ని కల్పించింది. WIFI సపోర్టును కూడా చేస్తుంది. అతి తక్కువ బరువును కూడా కలిగి ఉంటుంది వైర్లెస్ ప్రింటింగ్ మల్టీ టాస్కింగ్ స్క్రీన్ ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: