ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మోటార్ ఇండియా (NMIPL) సూపర్ డూపర్ ఫీచర్ లతో నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift AMT ని విడుదల చేసింది.దీని ప్రీ-బుకింగ్‌లు కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి.కేవలం రూ.6,49,900 ప్రారంభ ధరతో నిస్సాన్ ఈ SUV కార్ ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ నవంబర్ 10 దాకా చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift 5-స్పీడ్ Automated Manual Transmission తో యాడ్ చేయబడి ఉంటుంది. ఇందులో లో క్లచ్ సులభంగా మీకు డ్రైవింగ్ సౌకర్యాన్ని కూడా ఇస్తుంది. మెరుగైన పర్ఫామెన్స్, మంచి డ్రైవింగ్ ఫెసిలిటీతో నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్ ఇంజిన్ మాన్యువల్ ఇంకా EZ-Shift ట్రాన్స్‌మిషన్‌తో మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది.మాన్యువల్ వేరియంట్ 19.35 kmpl, EZ-Shift 19.70 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇంకా డ్యూయల్ డ్రైవింగ్ మోడ్‌తో, నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift గేర్‌బాక్స్ ఆటోమేటిక్ ఇంకా మాన్యువల్ డ్రైవింగ్ మోడ్‌ల మధ్య మీకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఇంకా స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో, ఇంటెలిజెంట్ క్రీప్ ఫంక్షన్ యాక్సిలరేటర్‌ని వాడకుండా బ్రేక్ పెడల్‌ను వేయడం ద్వారా లో స్పీడ్‌తో కారు డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది.మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం Magnet EZ-Shift లో యాంటీ స్టాల్, కిక్-డౌన్ వంటి ఫీచర్లని కూడా అందించారు.ఇక నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift కస్టమర్లకు మొత్తం నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. XE, XL, XV ఇంకా XV ప్రీమియం వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే హిల్ ఏరియాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సులభంగా ఉండేలా వెహికల్ డైనమిక్ కంట్రోల్ (VDC), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA) వంటి ఫీచర్లను కంపెనీ అందించింది.నిస్సాన్ మాగ్నైట్ టాప్ ట్రిమ్ రేంజ్ లో EZ-Shift వేరియంట్‌లను కొనుగోలు చేయాలనుకునేవారికి సరికొత్త డ్యూయల్ టోన్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక ఇది బ్లాక్ డ్యూయల్-టోన్ రూఫ్‌తో ఆకర్షణీయంగా కొత్త బ్లూ కలర్‌తో కూడా రానుంది. రీసెంట్ గా ప్రారంభించిన Magnet KURO స్పెషల్ ఎడిషన్‌ను ఎంచుకోవాలనుకునే కస్టమర్‌లకు EZ-Shift కూడా అందుబాటులో ఉంటుంది.