సేఫ్టీ ఫీచర్స్ ని అప్డేట్ చేసిన వాట్సాప్?

వాట్సాప్‌  చాలా ఫీచర్‌లను జోడిస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా సరికొత్త భద్రతా ఫీచర్‌ను వాట్సాప్ అందిస్తోంది. సాధారణంగా వాట్సాప్‌ ఖాతాను ధ్రువీకరించడానికి కచ్చితంగా ఫోన్‌ నెంబర్‌ అనేది అవసరం. అయితే ఇప్పుడు వినియోగదారులు వారి ఖాతాను ధ్రువీకరించడానికి కొత్త మార్గాన్ని వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తేలింది. వాట్సాప్‌ ఖాతాను ధ్రువీకరించే ఆ కొత్త అప్‌డేట్‌ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.ఇక వాట్సాప్‌ త్వరలో ఇమెయిల్ ద్వారా మీ ఖాతాను ధ్రువీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్‌కు సంబంధించిన బీటా వెర్షన్‌లో గుర్తించిన ఈ ఫీచర్‌ వాట్సాప్‌కు సైన్ ఇన్ చేయడానికి అదనపు ఎంపికను కూడా ఇస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్‌ ఖాతాదారులు వారి ఫోన్ నంబర్‌ తో మాత్రమే వారి ఖాతాను ధ్రువీకరించడానికి అనుమతిస్తుంది. వాట్సాప్‌ బీటా ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేసిన వ్యక్తులు తాజా అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్‌ను పొందుతున్నారు.


వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న వారు యాప్ సెట్టింగ్‌ల్లోకి వెళ్లి అనంతరం ఖాతాను సెలెక్ట్‌ చేసుకుని ఈ-మెయిల్ చిరునామాకు వెళ్లి కొత్త ఫీచర్ కోసం చెక్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.23.24.10 వెర్షన్, 2.23.24.8, 2.23.24.9 లో మాత్రమే అందుబాటులో ఉంది.వాట్సాప్ ఈమధ్య ఒక ఖాతాలో రెండు మొబైల్ నంబర్‌లను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని జోడించింది. ఒక పరికరంలో రెండు వేర్వేరు ఖాతాలను వాడేలా వ్యక్తులు గతంలో ఫోన్‌లలో డ్యూయల్ లేదా క్లోన్ యాప్ ఫీచర్‌ను వాడాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను కూడా అప్‌డేట్‌ చేసింది. విభిన్న నంబర్‌లను వాడి వినియోగదారులతో సులభంగా కనెక్ట్ అయ్యేలా చాలా మంది వ్యక్తుల ఉద్యోగాలను సులభతరం చేయడానికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే యాప్‌లో రెండవ వాట్సాప్ ఖాతాను సెటప్ చేయడం చాలా మంచి ఫీచర్.ఇంకా మరికొన్ని వారాల్లో చాలా ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్‌లు ప్రస్తుతం వాట్సాప్‌ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: