బుల్లి పిట్ట: ఆధార్- పాన్ కార్డు లింక్ చేయలేదా..?
ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ..https://www.incometax.gov.in/ అనే వెబ్సైట్ని సందర్శించడం మంచిది.
అక్కడ హోం పేజీలో ఎడమవైపున లింక్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది..
ఆ తర్వాత పాన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డులో ఉండే విధంగానే మన పేరు మొబైల్ నెంబర్ ని సైతం నమోదు చేయవలసి ఉంటుంది.
దీంతో మన నెంబర్ కి ఓటీపీ సైతం వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత..అక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అక్కడ లింక్ అయ్యి ఉంటే ఆధార్ లింక్డ్ అని చూపిస్తుందట.
ఎస్ఎంఎస్ ద్వారా పొందాలి అంటే:
మొబైల్ మెసేజింగ్ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత..UIDPAN టైప్ చేసి..12 అంకెల ఆధార నెంబర్..10 అంకెల పాన్ నెంబర్ ను టైప్ చేసి.. ఆ టైప్ చేసిన మెసేజ్ ను 56161 లేదా 567678 అనే నెంబర్ కి సెండ్ చేయాలి ఈ స్టెప్స్ ద్వారా మీ ఆధార్ పాన్ కార్డు లింక్ స్టేటస్ సైతం మన రిజిస్ట్రేషన్ మొబైల్ కి ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు. ఈ విధంగా ఆధార్ పాన్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.