బుల్లి పిట్ట: ఈ కాలంలో ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంత ఉంటే మంచిది..!!
దీని కారణంగానే ఆహార పదార్థాలు కూడా తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత సరిగ్గా సెట్ చేయకపోతే నిల్వ చేసిన ఆహార పదార్థాలు చెడిపోవడానికి కారణాలు అవుతాయి. ప్రస్తుతం అధునాతన రిఫ్రిజిరేటర్ల ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో సీజన్ల వారిగా గుర్తులను కూడా ఫ్రిడ్జ్ కంపెనీల సైతం ఇస్తూ ఉంటాయి .కానీ మీ ఫ్రిజ్లో అలాంటి మోడ్ లేదా మార్కింగ్ లేకపోతే శీతాకాలంలో ఫ్రిడ్జ్ ని ఎలాంటి ఉష్ణోగ్రతలో ఉంచాలని విషయం తెలుసుకోవాలి..
ముఖ్యంగా శీతాకాలం లో రిఫ్రిజిరేటర్ ను 1.7 నుంచి 3.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూడాలి.. దీని వల్ల ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం పాడవకుండా ఉండడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. దీనివల్ల కరెంటు బిల్లు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇలా ఏ కాలంలో అయితే ఆ కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను బట్టి రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ ని మారుచు కుంటూ ఉండటం వల్ల ఫ్రిడ్జ్ ఎక్కువ కాలం మన్నిక రవడమే కాకుండా ఎలాంటి రిపేర్లు కూడా ఉండవు.. మరి ఎవరికైనా ఈ విషయం తెలియ కపోతే వెంటనే అప్రమత్తమయి మీ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతను మార్చుకోండి.