బుల్లి పిట్ట: మొబైల్ లో ఈ యాప్స్ ఉంటే కాల్ రికార్డ్స్ .. వాట్సప్ చాట్ సేకరిస్తున్నట్టే..?
ఈ 12 యాప్స్ మెసేజింగ్, న్యూస్, హోరిస్కోప్ ఇతరత్రా ఫ్యాట్ ఫామ్ లు మాదిరిగానే ఉంటాయట ఇవి యూజర్స్ కి తెలియకుండా వారి సమాచారాన్ని సైతం సేకరిస్తూ ఉంటాయట. VAJRASPU అనే రిమోట్ యాక్సెస్ మొబైల్ లోని బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తూ సమాచారాన్ని సైతం దొంగలిస్తుందట. మన మొబైల్లో ఉండే యాప్స్ , కాంటాక్ట్ ఫైల్ మెసేజ్ వంటి సమాచారాన్ని కూడా దొంగలిస్తాయట. వీటితోపాటు కొన్ని యాప్స్ ఏకంగా వాట్సప్ సిగ్నల్ వంటివి ఇవ్వడం.. వాట్సాప్ డేటాను కూడా సేకరించగలరని నిపుణులు తెలుపుతున్నారు.అలాగే ఫోన్ కాల్ రికార్డు , మొబైల్ లోని కెమెరాతో అనుమతి లేకుండానే ఫోటోలు తీయగలిగే యాప్స్ కూడా ఉన్నాయట అలాంటివి ప్లేస్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి వాటిని థర్డ్ యాప్స్ గా పిలుస్తున్నారు గూగుల్ ఇప్పటికే ఇలాంటి యాప్స్ లను కూడా తీసివేసింది అయితే ఎవరైనా ఆ యాప్ లను తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నారేమో వారి డేటా చోరీ అయినట్టే అలాంటి యాప్స్ లిస్టు విషయానికి వస్తే.. హలో చాట్, మీట్ మీ, నిడుస్, చిట్ చాట్, రఫాకత్ న్యూస్, టాక్ టాల్క్, ప్రైవ్ టాక్, గ్లో గ్లో, లెట్స్ చాట్, వేవ్ చాట్, క్విక్ చాట్, యోహుటాక్ , త్రీడీ స్కిన్ ఎడిటర్, ఆటో క్లీన్ రిపీటర్, సౌండ్ వాల్యూమ్ ఎక్స్టెండ్, ట్రాక్ యువర్ స్లీప్, సౌండ్ వాల్యూమ్ బూస్టర్ ఈ యాప్స్ అన్ని కూడా తొలగించడం మంచిది.