బుల్లి పిట్ట: మీ పిఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలా.. సింపుల్ ప్రాసెస్..!!
అక్కడ ప్రతినెల మీ పిఎఫ్ అకౌంట్ గురించి పలు వివరాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ పిఎఫ్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ నెంబర్ ని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ పిఎఫ్ అకౌంట్తో యుఏఎన్ నెంబర్ని లింక్ చేసి ఉండాలి. UAN అకౌంట్ ని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ ,రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ వంటి వాటిని సమర్పించాలి. ఆ తర్వాత మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోనే ఆప్షన్ లభిస్తుంది.
మళ్లీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్లి యుఏఎన్ నెంబర్ను పాస్వర్డ్ ను ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ పాస్ బుక్ అనే ఆప్షన్ వస్తుంది. వాటి పైన క్లిక్ చేస్తే పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ పిఎఫ్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే EPFOHO UAN టైప్ చేసి..7738299899 అనే నెంబర్ కి ఎస్ఎంఎస్ పంపించాలి. లేకపోతే మిస్డ్ కాల్ సౌకర్యం వల్ల కూడా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని మనం చెక్ చేసుకోవచ్చు..9966044425 అనే నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇలా సింపుల్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.