సరికొత్త టెక్నాలజీ.. మద్యం తాగితే.. ఇక బైక్ స్టార్ట్ అవ్వదు?
కేవలం వాహదారులకు దీనిపై అవగాహన చర్యలు చేపట్టడమే కాదు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంటారు. అయితే ఇన్ని చేస్తున్న ఎందుకో వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ఫుల్లుగా మాత్రం తాగి వాహనం నడుపుతున్నారు. తద్వారా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలలో కొందరు అభం శుభం తెలియని అమాయకులు బలవుతుంటే ఇంకొన్ని ఘటనల్లో వాహనదారుల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి.
అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బైక్ వాడారు అంటే ఇకనుంచి మద్యం తాగడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగవు. అదేంటి అదేలా కుదురుతుంది అనుకుంటున్నారు కదా. మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఈ బైక్ స్టార్ట్ అవ్వదు. అలహాబాద్ లోని మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కొంతమంది నిపుణులు ఒక ఈ బైక్ ని తయారు చేశారు. ఇందులో ఆల్కహాల్ డిటెక్షన్ అండ్ స్మోక్ సెన్సార్లు అమర్చారు. డ్రైవర్ మద్యం సేవించినట్లయితే ఈ బైక్ స్టార్ట్ అవ్వదు. అంతేకాకుండా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఎమర్జెన్సీ నెంబర్లకు సమాచారం అందిస్తుంది ఈ బైక్. ఇక త్వరలోనే ఈ కొత్త ఎలక్ట్రికల్ బైక్ మార్కెట్ లోకి రాబోతుందట.