బుల్లి పిట్ట: ఫాస్ట్ ట్యాగ్ యూజర్స్ గుడ్ న్యూస్..!!
మార్చి 31వ తేదీ లోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో ఎవరైనా విఫలమైతే పూర్తిగా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుందంటూ తెలియజేస్తున్నారు.. కేవైసీ పూర్తి వివరాలను అప్డేట్ చేయడానికి వాహన యజమానుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి వంటి వాటిని గుర్తింపు కార్డులు గా సమర్పించాల్సి ఉంటుందంటూ వెల్లడించారు..
అధికారిక వెబ్సైట్ ద్వారా విజిట్ చేసి అక్కడ కేవైసీ అప్డేట్ ని పూర్తి చేసుకోవాలి.. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ తోనే లాగిన్ చేయడం ఉత్తమం.. మై ప్రొఫైల్ సెక్షన్ కు వెళ్లి కేవైసీ సబ్ సెక్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.. దీని ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.. ఇలాంటి సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను కూడా అక్కడ అప్లోడ్ చేయాలి..
ముందుగా fastag.ihmcl.com వెబ్ సైట్ లోకి వెళ్ళాలి..
ఈ వెబ్సైట్లో మీ రిజిస్ట్రేషన్ ముంబై నెంబర్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి..
రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి..
హోమ్ పేజీలో..my profile సెక్షన్లు కేవైసీ అనే ట్యాగ్ను ఎంచుకోవాలి..
అక్కడ అవసరమైన వివరాలను నమోదు చేసి వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.. దీంతో మీ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ పూర్తీ అవుతుంది.