ఏంటీ.. విద్యుత్ వాహనాలతోనే.. ఎక్కువ కాలుష్యం జరుగుతుందా?

praveen
ఇటీవల కాలంలో వాహనాల సంఖ్య ఎంతలా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా వాహనాల సంఖ్య పెరిగిపోయిన నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుంది. ఏకంగా వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా వాయు కాలుష్యం వాహనాల నుంచి వచ్చే శబ్దం కారణంగా శబ్ద కాలుష్యం జరుగుతుంది. అయితే ఇలా వాహనాల ద్వారా ఏర్పడిన కాలుష్యాన్ని తగ్గించేందుకు.. అటు ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి చర్యల్లో భాగంగానే అటు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారూ. ఈ క్రమంలోనే ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ వాహనాలకు బదులుగా ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ వాహనాలను వాడటం మొదలు పెడుతున్నారు.

 ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇండియాలో కూడా ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రికల్ కార్లు ఆటోలు బైక్లను సైతం విక్రయిస్తూ ఉన్నాయి. దీంతో ఇక ఎంతోమంది ఇలాంటి వాహనాలు వాడటం వైపే ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు అని చెప్పాలి. అయితే పర్యావరణ కాలుష్యం తగ్గించడంలో ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతో కీలకపాత్ర వహిస్తున్నాయని అందరు అనుకుంటుండగా.. ఇప్పుడు ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

 ఏకంగా డీజిల్ పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రికల్ వాహనాల ద్వారానే పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుందట. ఎమిషన్ అనలిటిక్స్ అనే సంస్థ రెండు రకాల కార్లలోని బ్రేకింగ్ టైర్ల నుంచి విడుదలయ్యే రేణువులపై అధ్యయనం చేసింది. ఈ అధ్యాయంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సాధారణ కార్ల ఇంజన్ కంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీలు ఎక్కువగా బరువుగా ఉంటాయట. దీంతో బ్రేక్ వేసినప్పుడు టైర్లపై అధిక ఒత్తిడి ఏర్పడి హానికారిక రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయని.. అధ్యయనంలో  బయటపడింది. ఇది పెట్రోల్ డీజిల్ కార్ల నుంచి విడుదలయ్యే వాటికంటే ఇక ఎంతో ప్రమాదకరం అంటూ వెల్లడించింది. అయితే సింథటిక్ రబ్బర్, ముడి చమురుతో టైర్లు తయారు చేస్తుండడమే ఇందుకు కారణమని ఇక పరిశోధకులు గుర్తించారు. అయితే గతంలో ఐఐటీ కాన్పుర్ నిర్వహించిన అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: