బుల్లి పిట్ట: మొబైల్ లోని డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్..!!
1). మొదట కేంద్ర ఎన్నికల సంఘం అయిన అధికారిక వెబ్సైట్..https://voter's.eci.gov.in/login) లోకి వెళ్ళాలి..
2). అక్కడ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని వెంటనే ఎంటర్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి దీని తర్వాతే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.
3). అలా మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్సా నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఓటిపి పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ కి మళ్ళీ ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై లాగిన్ పై క్లిక్ చేయాలి
4). ఆ తర్వాత మీకు సైట్లో కుడి వైపున..E-EPIC DOWNLOAD వాటిపైన క్లిక్ చేయాలి.అక్కడ మీ ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించి పది అంకెల యూనిక్ నెంబర్ ని నమోదు చేయాలి.. ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుని సర్చింగ్ బాక్స్ పైన క్లిక్ చేయాలి.
5). వెంటనే స్క్రీన్ పైన ఓటర్ ఐడి కి సంబంధించి వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలు సరైనవి అనిపిస్తే సెండ్ ఓటిపి పైన క్లిక్ చేయాలి.. మొబైల్ కి వచ్చిన ఓటీపీ పైన ఎంటర్ చేసి వెరిఫై బాక్స్ మీద క్లిక్ చేయాలి.
6). ఆ తర్వాతే పిడిఎఫ్ రూపంలో డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ కనిపిస్తుంది.. వెంటనే download e-Epic పైన క్లిక్ చేస్తే పిడిఎఫ్ లో సేవ్ అవుతుంది.