టెలిఫోన్ రిసీవర్ వైర్‌ ఎందుకు రింగులు రింగులు గా ఉంటుందో తెలుసా..?

frame టెలిఫోన్ రిసీవర్ వైర్‌ ఎందుకు రింగులు రింగులు గా ఉంటుందో తెలుసా..?

lakhmi saranya
ప్రస్తుతం అంటే టెలిఫోన్లు పెద్దగా వాడడం లేదు కానీ పూర్వకాలంలో టెలిఫోన్ ప్రతి ఇంట్లోనూ కామన్ గా ఉండేది. ఇక ఇలా ఉంటే ‌.. రకరకాల ఆకృతుల్లో కున్న వస్తువులను మనం చూస్తూ ఉంటాం. కానీ అవి ఆకారంలోనే ఎందుకు ఉన్నాయో పెద్దగా పట్టించుకోము. ఆ కోవాకు చెందినదే టెలిఫోన్ రిసీవర్ వైర్ కూడా. ఇప్పుడైతే సెల్ ఫోన్లు విరివిగా ఉపయోగిస్తున్నారు కానీ గతంలో టెలిఫోన్ను ఎక్కువగా యూస్ చేసేవారు. ఇప్పటికీ కూడా పలు కార్యాలయాలలో ఎక్స్టెన్షన్ గా వీటినే ఉపయోగిస్తున్నారు.
అయితే అందులోని రిసీవర్ వైరు ఉంగరాలు తిరిగి ఉంటుంది. అది కచ్చితంగా అలాగే ఎందుకు ఉండాలి? అనే సందేహన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం సౌలభ్యమేనట. రింగు రింగులుగా ఉండే స్పైరల్ కేబుల్ వాడటం వల్ల కొంతవరకు సాగి తిరిగి యధా స్థలానికి చేరుకునేందుకు వీలవుతుంది. ఫోన్ కు ఒకవేళ దూరంగా ఉన్న ఫోన్ బాక్స్ ను కదపకుండానే రిసీవర్ను మన చెవి వరకు లాక్కోవచ్చు. సాధారణ కేబుల్ వైరుల్లో ఇది సాధ్యపడదు. పక్కపక్కనున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడినప్పుడు రిసీవర్ చేతులు మారుతూ ఉంటుంది.
ఇలాంటి అప్పుడు వైరు చెక్కులు పడకుండా.. పాడవకుండా ఉండాలంటే స్పైరల్ కేబుల్ వాడడమే ఉత్తమం. కేవలం టెలిఫోన్ రిసీవర్లలోనే కాదు సెల్ఫోన్ ఛార్జింగ్ లు అండ్ కీ చైన్లలోనూ ఈ తరహా వైర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక వీటి గురించి తెలిసిన వారు ఎక్కువగా ఈ వైరస్ ని యూస్ చేసేందుకు ఇష్టపడతారు. ఇందులో ఉండే ఫెసిబిలిటీస్ మరి వైర్లోను ఉండవు. దూరం రావడమే కాకుండా సిగ్నల్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఇక చార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఎక్కుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ వైర్ ను ఎక్కువగా చార్జింగ్ కి కూడా వాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కార్యాలయాలలో ఇవి కనిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: