అన్ని పనులకు ఉపయోగపడే సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే?

frame అన్ని పనులకు ఉపయోగపడే సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే?

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అయిన ఈబైక్‌గో తన కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న 4జీ మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. భారతీయ వినియోగదారుల అవసరాలు, వారి కోరుకుంటున్న అంశాలను యాడ్ చేసినట్లు ఈ కొత్త స్కూటర్ తీసుకువచ్చినట్లు ఈబైక్ గో కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 100కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్లో 25కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మూడు గంటల సమయంలోనే ఏకంగా సున్నా నుంచి 80 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది.ఈ స్కూటర్ మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల చార్జింగ్ టైంతో పోల్చితే చాలా తక్కువ సమయం అని కంపెనీ పేర్కొంది.


ఈ స్కూటర్లో స్మార్ట్ ఎల్ఈడీ డిజిటల్ డిస్ ప్లే డ్యాష్ బోర్డు ఉంటుంది. మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసిన చాలా ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త స్కూటర్ గురించి ఈబైక్ గో ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లడుతూ అర్బన్ మొబలిటీలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని అన్నారు. అందులో భాగంగానే కొత్త రవాణా సాధనాలను పరిచయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక వాటిల్లో మువీ 125 5జీ ఈ-స్కూటర్ భారతీయ వినియోగదారులకు ఖచ్చితంగా సరిగ్గా సరిపోతుందని, వారి అవసరాలకు అనుగుణంగా దీన్ని తయారు చేసినట్లు చెప్పారు. కాగా ఇండియన్ ఎలక్ట్రికల్ స్కూటర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిలో ఓలా టాప్ సెల్లర్ గా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఏథర్, టీవీఎస్, బజాజ్ చేతక్ వంటి ఇతర బ్రాండ్లు ఉన్నాయి. అయితే ఈ స్కూటర్ ఇంటి అవసరాలను తీర్చడంలో బాగా ఉపకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: