ఇక ట్రూ కాలర్ అవసరం లేదు.. మొబైల్ యూజర్స్ కి గుడ్ న్యూస్?

frame ఇక ట్రూ కాలర్ అవసరం లేదు.. మొబైల్ యూజర్స్ కి గుడ్ న్యూస్?

praveen
నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్.. ఇక ఇప్పుడు ఏకంగా ఆరడుగుల మనిషినే తన బానిసగా మార్చుకోగలుగుతుంది. అయితే బయట ప్రపంచం తో పని లేకుండా.. మొబైల్ లోనే అన్ని దొరికేస్తూ ఉండడంతో చివరికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి మొబైల్ లోనే గంటలు తరబడి కాలం గడపడానికి ఇష్టపడి పోతున్నారు నేటి రోజుల్లో జనాలు.

 ఇక ఒకప్పుడు ఎవరినైనా కలవాలి అనుకుంటే నేరుగా వెళ్లి కలిసేవారు. కానీ ఇప్పుడు అంత టైం ఎక్కడిది. బిజీ బిజీ ప్రపంచంలో కాల్స్ మెసేజ్ లతోనే సరిపెట్టుకుంటున్నారు. విపరీతంగా ఇలా కాల్స్ మెసేజెస్ లలో మాట్లాడుకుంటూ ఉండడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తు తెలియని నెంబర్లనుంచి ఫోన్లు రావడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఏకంగా ఎన్నో కంపెనీలు క్రెడిట్ కార్డు ఇస్తామని లేదంటే పర్సనల్ లోన్ ఆఫర్ ఉందని లేదంటే ఇంకా ఏదైనా ఆఫర్ ఇస్తూ కాల్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో కొత్త నెంబర్ ఎవరిది అనేది తెలియక ఎంతోమంది ఐడిని తెలుసుకునేందుకు.. థర్డ్ పార్టీ యాప్లను వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్లలో ట్రూ కాలర్ కూడా ఒకటి. అయితే ఈ యాప్ ద్వారా కస్టమర్ల పర్సనల్ డేటా మొత్తం మరొకరి చేతుల్లోనే ఉంటుంది అని ఎన్నో రోజులుగా వాదనలు ఉన్నప్పటికీ సెల్ఫోన్ యూజర్లు చేసేదేమీ లేక ట్రూ కాలర్ ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రాట్ కాలర్ వాడాల్సిన పనిలేదు మొబైల్ యూజర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. మనకు ఫోన్ చేసే వారి పేరును తెలుసుకునే ఫీచర్ను ట్రాయ్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతుందట. ఫోన్లో అవతలి వారి నెంబర్ సేవ్ చేసి లేకుండా గుర్తు తెలియని వారు ఫోన్ చేసిన ఇకపై మన మొబైల్ స్క్రీన్ పై వారి పేర్లు కనిపిస్తాయట. ఈనెల 15 నుంచి ఇది అందుబాటులోకి రాబోతుందట. సిమ్ కార్డు కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానేఏదైనా నెంబర్ తో కాల్ వచ్చినప్పుడు వారి పేరు సూచిస్తుంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: