ఇండియాను బుట్టలో వేసుకుంటున్న గూగుల్‌?

frame ఇండియాను బుట్టలో వేసుకుంటున్న గూగుల్‌?

గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎక్కడికో బయల్దేరాం. దారిలో ఒక ఫ్లై ఓవర్ కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఏమో నేరుగా వెళ్లాలని చెబుతుంది. నేరుగా అంటే ఫ్లై ఓవర్ ఏక్కాలా ? లేక ఫ్లై ఓవర్ పక్కగా కింది నుంచి వెళ్లాలా అర్థం కాదు. ఇది చాలా మందికి ఎదురవుతున్న సమస్య.

దీనిని పరిష్కరిస్తూ.. గూగుల్ మ్యాప్స్ భారత్ లోకి కొత్త ఫీఛర్ ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు ఇరుగ్గా ఉండే రోడ్ల గురించి ముందే హెచ్చరించే ఫీచర్ ని, ద్విచక్ర విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో చెప్ఏ ఫీచర్, మెట్రో టికెటింగ్ ఇలా మొత్తం ఆరు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఓలా మ్యాప్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు గూగుల్ ఈ తరహా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్లై ఓవర్ అలెర్ట్ సమాచారం ప్రస్తుతానికి మన దేశంలోని 40 నగరాల్లో ఆండ్రాయన్ వినియోగదారులకు కనిపిస్తుంది. ఐఫోన్ వినియోగదారులకు మిగతా నగరాల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఇక దేశంలో విద్యుత్తు వాహనాలు.. ముఖ్యంగా ఎలక్ర్టిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్త ప్రముఖ ఈవీ ఛార్జింగ్ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఉన్న 8000 పైగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తాయి.

ఆయా స్టేషన్లలో ఏ తరహా ఛార్జర్లు ఉన్నాయనే విషయాన్ని కూడా గూగుల్ మ్యాప్స్ లో కనిపించే తొలిదేశం మనదే కావడం గమనార్హం. ఇక గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకొని వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఇరుకు రోడ్లు ప్రత్యక్షమవుతాయి. వెనక్కి, ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ ఇబ్బందిని తప్పించడానికి ఏఐ సాయంతో అలాంటి ఇరుకు రోడ్ల గురించి ముందే హెచ్చరించే ఫీచర్ ని ప్రవేశ పెట్టింది. అలాగే మనం వెళ్లే దారిలో ఏదైనా ప్రమాదం జరిగినా, నిర్మాణ పనుల వల్ల ఆ దారి బ్లాక్ అయినా గూగుల్ మ్యాప్స్ లో ఆ విషయాన్ని సులువుగా రిపోర్ట్ చేసే అవకాశాన్ని ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: