బుల్లి పిట్ట: భారత్లో వాట్సాప్ సేవలు నిలిపివేత.. క్లారిటీ ఇదే..!
కేంద్ర ప్రభుత్వం వాట్సప్ సేవలను నిలిపివేయాలంటూ ఎక్కడా కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవి తెలియజేశారు. వినియోగదారుల సమాచారాన్ని పంచుకోవాలని ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలోనే ఇండియాలో వాట్సాప్ సేవలను నిలిపివేయాలని ఆలోచిస్తుందా అంటూ కాంగ్రెస్ రాజ్యసభలు వివేక్ ప్రశ్నించడం జరిగింది. ఇలా సోషల్ మీడియాలపై ఆంక్షలు విధించడం పైన తంఖా అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇలా సమాధానాలను తెలియజేశారు.. ఆ సంస్థలకు కూడా అలాంటి యువజన లేదు అంటూ తెలిపారు ఎలక్ట్రానిక్ ఐటి మంత్రిత్వ శాఖ తెలియజేశారు.
అయితే ఐటి నిబంధనలలో కొన్ని సెక్షన్ల వల్ల వ్యక్తుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు సైతం భంగం కలిగించే విధంగా ఉన్నాయని తెలియజేశారు..వాట్సాప్ , ఫేస్బుక్ సంస్థల పైన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు.ముఖ్యంగా సోషల్ మీడియాను సృష్టించిన వారిని బహిర్గతం చేసే విధంగా నిబంధనను సవరించాలి అంటూ ప్రభుత్వాన్ని కోరాయి..ఈ క్రమంలోనే మెసేజ్లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని కూడా తొలగించాలని చెప్పడంతో తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ ఆ సందర్భంగా వాట్సప్ తెలియజేసిందట.. కానీ ప్రస్తుతం అయితే భారత్ లో వాట్సాప్ సేవలను నిలిపివేయడం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియా యూజర్స్ అయితే కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తోంది.