భారతీయ యూజర్లకు గూగుల్ గిఫ్ట్.. ఇకపై ఫుల్ హ్యాపీ..?

frame భారతీయ యూజర్లకు గూగుల్ గిఫ్ట్.. ఇకపై ఫుల్ హ్యాపీ..?

Suma Kallamadi


గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చాక నావిగేషన్ చాలా సులభం అయిపోయింది. ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా కొత్త ప్రదేశాలకు ఈజీగా చేరుకోగలుగుతున్నాము. ప్రాంతాల గురించి పెద్దగా తెలియని వారికి, రహదారులను మరిచిపోయే వారికి గూగుల్ మ్యాప్స్ ఒక వరం అయింది. గూగుల్‌ను నమ్ముకుంటే గోదాట్లో పడటమే అని చాలామంది అనుకుంటారు కానీ కొన్ని వందల కోట్ల మంది దీన్ని ఉపయోగిస్తుంటే ఒకటి రెండుసార్లు మాత్రమే అలా జరుగుతుంటాయి. అది కూడా యూజర్ల తప్పుల వల్లే జరుగుతాయి. 

కొంచెం జాగ్రత్తగా వెళితే గూగుల్ మ్యాప్స్ తో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. అయితే ఈ మ్యాప్స్ వాడే ఇండియన్లు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. వాటిని పరిష్కరించడానికి గూగుల్ కొత్త పరిష్కారంతో ముందుకు వచ్చింది. ఇండియాలో చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లుతున్నారు. కానీ ఈ స్టేషన్‌లు ఎక్కడ ఉన్నాయనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన ఈ టెక్ దిగ్గజం ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లతో పార్ట్‌నర్ షిప్ కుదుర్చుకుంది. 

దీని ఫలితంగా ఇకపై మ్యాపులో ఎక్కడ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో తెలుస్తుంది. ఇది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలాగా భారత ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఇండియాలో చాలా ఫ్లై ఓవర్స్ ఉంటాయి. అయితే గూగుల్ మ్యాప్స్ అనేది స్ట్రైట్ గా వెళ్ళమని చెప్తుంది కానీ ఫ్లై ఓవర్ ఎక్కాలా లేదంటే కిందనుంచి వెళ్లిపోవాలా అనేది చెప్పదు. దీనికి కూడా పరిష్కారం చూపుతోంది. ఫ్లై ఓవర్ వస్తే, ఎక్కాల్సి ఉంటే దానిని ఎక్కమని ఇది సలహా ఇస్తుంది.

ఇంతకుముందు డెస్టినేషన్ కి డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు చిన్న సందులను కూడా గూగుల్ సజెస్ట్ చేసేది. వాటిలో కార్లు పట్టకపోయేవి. వేరే రూట్ ఇది చూపించకపోయేది కాదు. దీనివల్ల ఇబ్బంది ఎదురయ్యేది. అయితే దీనికి కూడా సొల్యూషన్ ఇస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీధిలో సన్నవిగా ఉన్నాయి. లేదంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది అని గూగుల్ తెలియజేస్తుంది. తద్వారా వేరే రూట్ ఎంచుకుని త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్లు అన్నీ కూడా త్వరలోనే భారతీయులకు రిలీజ్ అవుతాయి. వీటిని ప్రకటించింది కాబట్టి తీసుకురావడం ఖాయం అని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: