ఫోన్లో నెట్వర్క్ లేదా..? అయినా కాల్ మాట్లాడొచ్చు..!
నెట్వర్క్ సమస్య ఉన్న సమయంలో లాప్టాప్ ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయాలి. అందులో కాలింగ్ సెట్టింగ్ ను ముందుగా సెట్ చేసుకోవాలి. అక్కడ కనిపించే ఫోన్ కాల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే కాంటాక్ట్ నేమ్స్ కానీ నెంబర్ కానీ అడుగుతుంది. ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారో వారి నంబరుకు వెంటనే కాల్ వెళ్ళిపోతుంది. వారు వేరే దేశంలో ఉన్నప్పటికీ వాట్సాప్ డెస్క్ టాప్ ని ఉపయోగించి కాల్స్ చేసేయొచ్చు. అయితే దీని కోసం మీ ల్యాప్టాప్ కి తప్పకుండా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అని మర్చిపోకండి .
మీ ఫోన్లో నెట్వర్క్ లేకపోయినా కాల్స్ చేయొచ్చు?
వాట్సప్ కాల్ కోసం ముందుగా వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ ను లాప్టాప్ లో ఓపెన్ చేయాలి.
తర్వాత వీడియో కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
వాయిస్, వీడియో కాల్ పై క్లిక్ చేసిన తర్వాత ఆడియో అవుట్ ఫుట్ పరికరం మైక్రోఫోన్ ఎంపికను అంగీకరించండి. వెంటనే కాల్ వెళ్లిపోతుంది.
మీ కాంటాక్ట్ తో వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మీరు వీడియో కాల్ కి మారొచ్చు. వీడియో కాల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అవతలి వ్యక్తి స్విచ్ ని అంగీకరిస్తే మీరు వాయిస్ మరియు వీడియోకి మారవచ్చు. పైన చెప్పిన టిప్స్ పాటిస్తే... మనం నెట్ వర్క్ లేకుండా కాల్ చేయొచ్చు అన్న మాట.