ప్రముఖ యూనివర్సిటీ సైంటిస్టులు కొత్త ఇన్వెన్షన్.. చిన్న బ్యాటరీలతో ఆ ప్రాబ్లమ్‌కి చెక్..

frame ప్రముఖ యూనివర్సిటీ సైంటిస్టులు కొత్త ఇన్వెన్షన్.. చిన్న బ్యాటరీలతో ఆ ప్రాబ్లమ్‌కి చెక్..

Suma Kallamadi
కొత్త బ్యాటరీలను కనిపెట్టాలని శాస్త్రవేత్తలు నిత్యం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే MIT ఇంజనీర్లు చాలా చిన్న బ్యాటరీని తయారు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇది మనిషి వెంట్రుకలా సన్నగా ఉంటుంది. ఈ చిన్న బ్యాటరీ గాలి నుంచి శక్తిని పొందగలదు. చిన్న పరికరాలను రన్ చేయగలదు. ఈ కొత్త బ్యాటరీ చాలా చిన్నది కాబట్టి అందరినీ అబ్బురపరుస్తోంది. రోబోలు పని చేయడానికి, మానవ శరీరం లోపల ఔషధాన్ని అందించడానికి సహాయం చేయడం వంటి అనేక విధాలుగా దీనిని ఉపయోగించవచ్చు.
గ్యాస్ పైపులలో లీక్‌లను కనుగొనడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.  బ్యాటరీ చాలా చిన్నది, ఇది చిన్న కంప్యూటర్లు, సెన్సార్లకు శక్తినిస్తుంది. టెక్నాలజీలో ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పుకోవచ్చు. MIT సైంటిస్ట్  మైఖేల్ స్ట్రానో మాట్లాడుతూ ఈ కొత్త మైక్రోబ్యాటరీ రోబోలకు బాగా పనికొస్తుందని చెప్పారు. ఈ చిన్నపాటి బ్యాటరీలతో రోబోలను తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోబోలు చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని రోబోలు తోలుబొమ్మల్లా ఉంటాయి.  అవి వేరొకదాని ద్వారా నియంత్రించబడతాయి. ఈ రోబోలకు బ్యాటరీలు అవసరం లేదు. ఎందుకంటే అవి ఇతర వాటి నుంచి శక్తిని పొందుతాయి.  
కానీ మనం చేరుకోలేని ప్రదేశాలకు రోబోలు వెళ్లాలంటే, వాటికి వాటికి శక్తి అవసరం. ఇక్కడ చిన్న బ్యాటరీ ఉపయోగపడుతుంది. ఇది ఈ చిన్న రోబోలకు శక్తిని ఇవ్వగలదు. శాస్త్రవేత్తలు చిన్న బ్యాటరీని పెద్ద యంత్రానికి కనెక్ట్ చేయడానికి వైర్‌ను ఉపయోగించారు.  ఈ చిన్న రోబోలు మానవ శరీరంలోని సమస్యలను తనిఖీ చేయడం వంటి ముఖ్యమైన పనులను చేయగలవని వారు భావిస్తున్నారు. శరీరంలోని నిర్దిష్ట ప్రదేశాలకు ఇన్సులిన్ వంటి ఔషధాలను అందించడానికి ఈ రోబోలను ఉపయోగించాలనుకుంటున్నారు.  శరీరానికి సురక్షితంగా ఉండే పదార్థాలతో రోబోలను తయారు చేయనున్నారు. శాస్త్రవేత్తలు బ్యాటరీని మరింత శక్తివంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధన చేయడానికి వారు యూఎస్ ప్రభుత్వం నుండి డబ్బు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: