ఇండియాలో ఎక్కువ శాతం నెట్ ను వినియోగించే జనాలు దేని గురించైనా తెలుసుకోవాలి అనుకున్నట్లు అయితే వెంటనే క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. కొంత మంది గంటలు గంటలు క్రోమ్ బ్రౌజర్ ని యూస్ చేస్తూ అనేక పనులను చేస్తూ ఉంటారు. మరి కొంత మంది ఎన్నో విలువైన సమాచారాలను కూడా వాటి ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఇకపోతే క్రోమ్ బ్రౌజర్ వాడే వినియోగదారులకి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వార్నింగ్ ను ఇచ్చింది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ బ్రౌజర్ లో అనేక బాగ్స్ ఉన్నాయి అని , వాటితో క్రోమ్ బ్రౌజర్ ను వాడే యూసర్లు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం చాలా ఉంది అని పేర్కొంది. ఈ సందర్భంగా క్రోమ్ బ్రౌజర్ వాడే వ్యక్తులు హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చేసింది. క్రోమ్ బ్రౌజర్ లో చాలా పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి. వాటి సహాయంతో హ్యాకర్లు ఎవరి సిస్టమ్ నైనా హ్యాక్ చేయగలరని పేర్కొంది. క్రోమ్ బ్రౌజర్ లో సేవ్ చేసిన పాస్‌వర్డ్ లను హ్యాకర్స్ చూడడంతో పాటు కాపీ చేసేందుకు ఛాన్స్ ఉందని ఈ సంస్థ తెలిపింది.
గూగుల్ క్రోమ్ విండోస్ లో 128.0.6613.113/114 తో పాటు అంతకు ముందు వెర్షన్లు , మ్యాక్ లో 128.0.6613.113/.114, లినక్స్ లో 128.0.6613.113 తో పాటు అంతకు ముందు వెర్షన్ లలో బగ్ లు ఉన్నాయని ఈ సంస్థ పేర్కొంది. ఈ వర్షన్ బ్రౌజర్లను ప్రస్తుతం వాడుతున్న వారంతా కచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచించింది. లేనట్లయితే ఈ వర్షన్ బ్రౌజర్ లతో క్రోమ్ ను వినియోగించినట్లు అయితే హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది.