బుల్లి పిట్ట: చౌక ధరకే టాటా ఈవీ ఎలక్ట్రిక్ బైక్.. మైలేజ్,ధర ఎంతంటే..?
త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టాటా తీసుకురాబోతున్నట్లు ప్రకటన నేపథ్యంలో ఈ స్కూటర్ ఫీచర్స్ ఇవే నంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి.. టాటా ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన మోటార్ తో ఉండబోతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఒకసారి చార్జింగ్ చేస్తే సుమారుగా 270 కిలోమీటర్లకు పైగా వెళ్లేలా ఈ బైక్ ని తయారు చేస్తున్నారట.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3KW మోటార్ గా ఉండబోతోందట. అలాగే ఇందులో డిజిటల్ ఇన్స్ట్రక్షమెంట్, టచ్ స్క్రీన్ డిస్ప్లే యుఎస్బి చార్జింగ్, బ్లూటూత్, ఎల్ఈడి హెడ్‌లైట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో పాటు ట్యూబ్ లెస్ టైర్లు కూడా ఉంటాయట.
అయితే ఈ టాటా ఎలక్ట్రిక్ బైక్ ఒక్క సారి ఛార్జ్ చేయడానికి సుమారుగా 3 గంటల సమయం పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామంది ప్రజలు కూడా ఈ టాటా ఎలక్ట్రిక్ గురించి విన్న తర్వాత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని మరికొన్ని నెలలలో టాటా గ్రూప్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నారట .ముఖ్యంగా దీన్ని ధర విషయానికి వస్తే రూ .67 వేల రూపాయల నుంచి ఉండేలా టాటా గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇలాంటి చౌకైన ధరకే ఎలక్ట్రిక్ బైక్ వస్తే అది కూడా బ్రాండెడ్ నుంచి వస్తే ప్రజలు కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు.