సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అత్యంత ప్రభావితమైన ప్లాట్ ఫామ్ లలో యూట్యూబ్ ఒకటి. యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఏ విషయం జరుగుతుందో మనకు సెకండ్ల వివదిలో తెలిసిపోతుంది. ఇక యూట్యూబ్ పెద్ద మొత్తంలో డబ్బులను ఇవ్వడం ద్వారా ఎంతో మంది దీని ద్వారా డబ్బులను సంపాదించుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఇక కొంత మంది కేవలం యూట్యూబ్ ద్వారానే జీవనాన్ని కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక యూట్యూబ్ డబ్బులు ఎలా వస్తాయి అంటే మనం చూసే యాడ్స్ ద్వారానే వారికి డబ్బులు వస్తాయి.
వాటిని బట్టి యూట్యూబ్లో వీడియోలను అప్లోడ్ చేసే వారికి యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో చాలా తక్కువ మొత్తంలో ప్రకటనలు వచ్చేవి. అవి కూడా వీడియో మధ్యలో వచ్చేవి. కానీ యూట్యూబ్ యూజర్ల సంఖ్య పెరగడంతో మనం ఏదైనా వీడియో చూడాలి అని ఆ వీడియో ఓకే చేస్తే చాలు ప్రకటనలు వస్తున్నాయి. ఇక ఈ ప్రకటనలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్కిప్ చేయడానికి అనుకూలంగా ఉండే ప్రకటనలు , మరికొన్ని స్కిప్ చేయడానికి అనుకూలంగా లేని ప్రకటనలు.
ఇకపోతే స్కిప్ చేయడానికి అనుకూలంగా ఉన్న ప్రకటనలు రాగానే కొంత నిడివి తర్వాత స్కిప్ ఆప్షన్ కనబడుతుంది. దానిని నొక్కితే వీడియో ఓపెన్ అవుతుంది. ఇకపోతే కొంత మంది మాత్రం స్కిప్ ఆప్షన్ ఉన్న ప్రకటనలు కూడా స్కిప్ ప్రదేశంలో బ్లాక్ గా కనబడుతుంది అని , స్కిప్ ఆప్షన్ కనబడడం లేదు అని ఆరోపిస్తున్నారు. ఇకపోతే దీనిపై యూట్యూబ్ ప్రతినిధి ఒలువా ఫలోదున్ ఖండించారు ఈ ఆరోపణలను ఖండించాడు. యూట్యూబ్ యాడ్ స్కిప్ బటన్ను తీసివేయలేదని , స్కిప్ యాడ్ ఆప్షన్ కనిపిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని ఆయన అన్నారు.