బుల్లి పిట్ట: ఈ మొబైల్ ముందు ఐఫోన్ కూడా దిగదుడుపే.. అదిరిపోయే ఆప్షన్స్..!

Divya
ప్రస్తుతం ఎక్కువగా స్మార్ట్ మొబైల్ హవా ఎక్కువగా నడుస్తూ ఉన్నది. అందుకే చాలా బడా కంపెనీలో సైతం కొత్త కొత్త ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ని మార్కెట్లో విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది కానీ ఒకప్పుడు కీప్యాడ్ మొబైల్స్ హవా బాగా కొనసాగింది. రాను రాను టెక్నాలజీ మారుతున్న కొద్దీ పలు రకాల మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోయేలా ఒక మొబైల్ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.ముఖ్యంగా ఈ మొబైల్ యొక్క ఆప్షన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ గా మారుతున్న వీడియో ప్రకారం ఒక వ్యక్తి కీప్యాడ్ మొబైల్ ని విక్రయిస్తున్నాడు అందులో ఏముంది అనుకుంటున్నారా.. అయితే అతడు విక్రయిస్తున్న ఈ మొబైల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ మొబైల్ చూడడానికి కీప్యాడ్ మొబైల్ లాగే ఉన్నప్పటికీ.. చూడడానికి కూడా చాలా లావుగా కనిపిస్తున్నది వెనుక వైపు పెద్ద పెద్ద స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఫోన్కు ఒక సైడు మధ్యలో ప్లాస్టిక్ ఫ్యాన్ కూడా ఉన్నది.. అలాగే మొబైల్ కి వీటిని బిగించుకొని సదుపాయం కూడా కలదు.

అయితే కీప్యాడ్ ఫోన్ మాట్లాడుకోకుండానే ఉక్క పోసినప్పుడు ఫ్యాన్ లా కూడా మారుతుంది.ఇదే కాకుండా మరికొన్ని ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయట అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్.. ఐఫోన్లు తలదన్నేలా ఈ మొబైల్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 198 లైక్స్ తో 7వేల వ్యూస్తో వైరల్ గా మారుతోంది. ఇందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతోంది. మరి మళ్లీ రాబోయే రోజుల్లో కీప్యాడ్ మొబైల్స్ కి ఎక్కువ డిమాండ్ వస్తుందేమో చూడాలి మరి. గతంలో కూడా కీప్యాడ్ మొబైల్స్ కి పలు రకాల ఆప్షన్లతో లభించాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: