బుల్లి పిట్ట: మొబైల్ ఛార్జింగ్ నిమిషాలలో అయిపోతోందా.. ఈ సెట్టింగ్ మారిస్తే చాలు..!

Divya
స్మార్ట్ మొబైల్ ఉపయోగించే వారందరికీ కూడా కొన్ని సందర్భాలలో బ్యాటరీ సమస్య ఎక్కువగా విసిగిస్తూ ఉంటుంది. మొబైల్ ఎంత ఛార్జింగ్ చేసినా కూడా త్వరగా అయిపోతూ ఉండడం వల్ల పదేపదే మొబైల్ కి ఛార్జింగ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇలాంటి సమస్య ఉంటే ఒక చిన్న సెట్టింగ్ మార్చుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవచ్చట. మరి ఆ సెట్టింగ్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

స్మార్ట్ మొబైల్ ని వాడేవారు బ్రైట్నెస్ విషయంలో కచ్చితంగా ఒక సరైన కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా బ్రైట్నెస్ ఉపయోగించడం వల్ల బ్యాటరీ డ్రై అయిపోతుంది. ఎక్కువ బ్రైట్నెస్ ఉపయోగించుకోకుండా ఉండటం వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇందుకోసం మీరు ఆటోమేటిక్ బ్రైట్నెస్ అని ఆప్షన్ ని సెట్ చేసుకోవచ్చు ఇది చార్జింగ్ తగ్గకుండా కూడా ఉపయోగిస్తుందట. మనం ఉండే ప్రదేశాన్ని బట్టి ఇది బ్రైట్నెస్ ని ఆ విధంగా మనకి చూపిస్తుంది. ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోవాలి అంటే సెట్టింగ్ లోకి వెళ్లి డిస్ప్లే టెక్స్ట్ బ్రైట్నెస్ పైన క్లిక్ చేసి అక్కడ ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి.

మరొకటి ఏమిటంటే లొకేషన్ సర్వీసెస్ సెట్టింగ్.. అనవసరమైన యాప్లకు లొకేషన్ యాక్సిస్ ఇవ్వడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా పర్సనల్ డేటా హ్యాకింగ్ కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నావిగేషన్, వెదర్ యాప్ల సెట్టింగ్లను సైతం తరచూ చెక్ చేస్తూ ఉండాలి. అలాగే మొబైల్ లో ఏవైనా యాప్స్ కి లొకేషన్ లను యాక్సెస్ చేసామా అనవసరం అనిపిస్తే వాటిని రిమూవ్ చేయడం మంచిది.

వైఫై ఎక్కువగా ఉన్నా లేకున్నా ఆన్ లో ఉన్న చార్జింగ్ ఎక్కువగా అయిపోతుందట. అలాగే మొబైల్ హాట్ స్పాట్ అనేది కూడా ఎక్కువసేపు ఆన్ లో ఉంచడం వల్ల మొబైల్ ఛార్జింగ్ ఎక్కువగా తీసుకుంటుందట. మొబైల్ డేటాని కూడా అవసరం లేని సమయంలో ఆఫ్ చేయడం మంచిది. అలాగే థర్డ్ పార్టీ యాప్లను కూడా ఉపయోగించుకోకుండా ఉండడం వల్ల యాడ్స్ వల్ల మొబైల్ ఛార్జింగ్ తగ్గకుండా ఉంటుంది. ఇలాంటి టిప్స్ పాటిస్తే స్మార్ట్ మొబైల్ బ్యాటరీ తగ్గిపోకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: