బుల్లి పిట్ట: BSNL నుంచి టీవీ సర్వీస్.. ఏకంగా 500 చానల్స్..OTT కూడా..!
ఈ యాప్ ద్వారా నేరుగా మనం టీవీ చానల్స్ ని చూడవచ్చట. అయితే దీనికి ఇంటర్నెట్ అవసరమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ని ఇంటర్నెట్ లేకుండానే మనం చూసుకోవచ్చట. ఇది కేబుల్ టీవీ లాంటిదట. ఎలాంటి నెట్వర్క్ లేకుండా హెచ్డి నాణ్యతతో బిఎస్ఎన్ఎల్ ప్రత్యక్ష టీవీ మనం చూడవచ్చు. కేవలం మనం bsnl FTTH కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ యాప్ ను మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే చాలు. వీటితో పాటుగా మనం PAYTV, అమెజాన్, డిస్నీ ప్లస్, నెట్ ఫ్లిక్, యూట్యూబ్, ZEE -5 OTT వంటి యాప్స్ లను సైతం తీసుకోవచ్చు. బ్రాడ్ బ్రాండ్ ప్లాన్ ఉంటే ఈ చానల్స్ అన్నిటిని కూడా ఆఫర్ కింద పొందవచ్చట.
అయితే మీరు బిఎస్ఎన్ఎల్ టీవీని ఉపయోగించుకునే డేటాకు ఈ బ్రాడ్ బ్రాండ్ ప్లాన్ లో అందించిన డేటాకు మాత్రం ఎలాంటి సంబంధం ఉండదట. అందుకే మనం ఇంటర్నెట్ లేకుండానే బిఎస్ఎన్ఎల్ టీవీ యాప్ ని మనం ఉచితంగానే చూసుకోవచ్చు. అయితే బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీలో మనకు.. సన్ టీవీ, విజయ టీవీ, కలర్స్ తమిళ్, KTV వంటి చానల్స్ మొదలవుతాయట. ఇతర చానల్స్ కావాలి అంటే సబ్స్క్రిప్షన్ ని పొందాల్సి ఉంటుంది. వీటికి ఇంటర్నెట్ చార్జీలు మాత్రం అసలు ఉండవట. ఈ ఛానల్స్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ కేబుల్ టీవీ, సెటప్ బాక్స్ లేకుండానే ప్రయోజనాలను సైతం పొందుకోవచ్చు. వీటిని తమిళనాడు, మధ్యప్రదేశ్లో మాత్రమే ప్రారంభించారు. రాబోయే రోజుల్లో సక్సెస్ అయితే కచ్చితంగా అన్ని ప్రాంతాలలో వీటిని తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కచ్చితంగా జియో, ఎయిర్టెల్ వంటి యాప్స్ లకు కూడా గట్టి పోటీ ఏర్పడుతుంది.