ఆక్స్ ఫర్డ్ సర్వే.. ఈ ఏడాది ఎక్కువ వెతికిన పదం ఇదేనట?

frame ఆక్స్ ఫర్డ్ సర్వే.. ఈ ఏడాది ఎక్కువ వెతికిన పదం ఇదేనట?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఏం తెలుసుకోవాలన్నా కూడా కష్టం అయ్యేది. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా కావాల్సిన ప్రతి సమాచారం కూడా అందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కావాల్సిన దానికంటే ఎక్కువగానే సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 దీంతో ఒకప్పటిలాగా ఏదైనా తెలియని విషయాలు తెలుసుకునేందుకు పక్క వాళ్ళను అడగడం కాదు.. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి ఇక కావాల్సిన సమాచారం టైప్ చేసి ఒక్క క్లిక్ ఇస్తే చాలు కళ్ళముందే కావాల్సినదంతా ప్రత్యక్షమవుతూ ఉంది అని చెప్పాలి. దీంతో ఇక అన్ని విషయాలను కూడా ఎంతో ఈజీగా తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఇలా టెక్నాలజీ కారణంగా ప్రతి పనిని కూడా సులభతరం చేసుకోగలుగుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఏదైనా తెలియని పదాన్ని తెలుసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేయడం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం 2024 ఏడాది చివరకు చేరుకున్న నేపథ్యంలో ఈ ఏడాది మొత్తంలో ఇప్పటివరకు ఎక్కువమంది సెర్చ్ చేసిన పదం ఏంటి అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా 2024 ఏడాదిలో manifest అనే పదాన్ని ఎక్కువమంది సెర్చ్ చేశారట. ఇక ఈ విషయాన్ని కేం బ్రిడ్జ్ డిక్షనరీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. 2024లో ఏకంగా 1.30 లక్షల మంది manifest అనే పదానికి అర్థం ఏంటి అన్న విషయాన్ని వెతికారట. దీంతో ఇక ఈ పదం ఎక్కువ సెర్చ్ చేసిన పదంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకీ మ్యానిఫెస్టో అంటే విజువలైజేషన్ అండ్ ఆఫర్మేషన్ . మరి మీరు ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా ఏ పదం కోసం సెర్చ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: