మొబైల్ డేటా, వైఫై రెండింటిలో.. ఏది వాడితే ఫోన్ బ్యాటరీకి మంచిది?
వైఫై సిగ్నల్‌లు మొబైల్ డేటా కంటే స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫలితంగా, ఫోన్‌కి తక్కువ శక్తి అవసరం. అంటే, వై-ఫై వాడితే ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై నెట్‌వర్క్ ఉన్న చోట ఉంటే, మొబైల్ డేటాకు బదులు WiFiని వాడటం మంచిది. ఎందుకంటే వైఫై వాడితే మన ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుంది. ఉదాహరణకు ఇంట్లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారనుకోండి. ఈ సమయంలో వైఫైని వాడితే, మీ ఫోన్ బ్యాటరీ 5 గంటలు ఉంటుంది. కానీ, మొబైల్ డేటా వాడితే బ్యాటరీ 3 గంటల్లో ఖాళీ అయిపోతుంది.
ముందుగా చెప్పుకున్నట్లు మనం మొబైల్ డేటా వాడేటప్పుడు, ఫోన్ ఎప్పుడూ నెట్‌వర్క్ సిగ్నల్‌ని వెతుకుతూ ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్ తక్కువగా ఉన్న చోట్ల ఇది ఎక్కువగా జరుగుతుంది. చాలా కష్టంగా సిగ్నల్ కోసం సెర్చ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. కానీ వైఫై సిగ్నల్ స్థిరంగా ఉంటుంది. అంటే, ఫోన్‌కి ఎప్పుడూ సిగ్నల్ వెతకవలసిన అవసరం ఉండదు. దీంతో ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుంది.
WiFi మరో రెండు ప్రయోజనాలు చూస్తే మొబైల్ డేటా కంటే వైఫై వేగంగా, నమ్మదగినదిగా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ఉన్న చోట్ల మొబైల్ డేటా స్లోగా అవుతుంది. కానీ వైఫై స్థిరంగా ఉంటుంది. పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం, వీడియోలు చూడటం లేదా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం లాంటివి చేసేటప్పుడు వైఫై వాడితే మొబైల్ డేటా సేవ్ అవుతుంది. మనీ పరంగా కూడా తక్కువ ఖర్చవుతుంది.
మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే, ఎప్పుడూ వైఫై ని వాడటానికి ప్రయత్నించండి. వైఫై దొరకని చోట్ల మాత్రమే మొబైల్ డేటా వాడండి. అంతేకాదు, సిగ్నల్ బలంగా ఉన్న చోట్ల ఉండాలి. అవసరం లేనప్పుడు మొబైల్ డేటా ఆఫ్ చేయాలి లేదా ఫోన్‌ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులతో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు. ఫోన్ కూడా మరింత బాగా పని చేస్తుంది.