బుల్లి పిట్ట: జనవరి నుంచి ఈ ఫొన్స్ లో వాట్సప్ బంద్.. లిస్టులో మీ మొబైల్ ఉందా..?
ముఖ్యంగా తొమ్మిది నుంచి పదివేల క్రితం ఉపయోగించిన ఆండ్రాయిడ్ కిట్ క్వాట్ ఓఎస్ తో పనిచేసే మొబైల్స్ లో ఇకమీదట వాట్సాప్ పనిచేయదట. ఇలాంటి వాటిలో వాట్సాప్ ఉపయోగించడం వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడుతారని వీటిని దృష్టిలో ఉంచుకొని పలు రకాల మార్పులు చేయబోతున్నట్లు వాట్సాప్ ఇటీవల తెలియజేయడం జరిగింది.. అలాగే ఐఫోన్లలో 15.1 తో పాటుగా ఓల్డ్ వర్షన్ కలిగిన ఐఫోన్లలో కూడా వాట్సాప్ సేవలను నిలిపివేయబోతున్నారట.. ఐఫోన్ 5s,...6,6+ మొబైల్స్ వాడుతున్న వారు అప్గ్రేట్ చేసుకోవాలని తెలియజేస్తోంది వాట్సాప్ సంస్థ. లేకపోతే సేవలు నిలిపివేయబడతాయని తెలియజేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి 2025 నుంచి ఏఏ మొబైల్స్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయనే విషయంపై కొన్ని మొబైల్స్ లిస్టును విడుదల చేశారు.
Samsung:
Galaxy S-3, GALAXY NOTE 2, GALAXY S4 MINI, GALAXY ACE -3,
MOTOROLA:.
MOTO G, MOTO E 2014 ,Razr Hd
Htc:
One X, desire 500, one X+, desire 601
LG:
Optimus G, G2MINI, NEXUS4, L-90
SONY:
XPERIA-T, XPERIA-Z, XPERIA-SP, XPERIA-V
ఈ మొబైల్స్లలో జనవరి 2025 నుంచి వాట్సాప్ పనిచేయదట.. ఈ మొబైల్స్ కలిగి ఉన్నవారు కొత్త మొబైల్స్ కొనడం మంచిది.