బుల్లిపిట్ట: జియో నుంచి చౌక ధరకే ఏసీలు..కేవలం రూ. 22 వేలు..?
మధ్యతరగతి వారికి సరిగ్గా సరిపోయేలా ఏసీ ని డిజైన్ చేశారు. ఇండోర్ యూనిట్ స్లిమ్ ప్రొఫైల్ తో పాటుగా బెడ్ రూమ్ లేదా హాల్లో ఎక్కడైనా సరే అనుకూలంగా అమర్చుకోవడానికి ఉంటుంది. ఏసీ కి ఉపయోగించిన ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా దృఢంగా ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా రూపొందించారు. అధిక దుమ్ము, అధిక వేడి తట్టుకునేలా అవుట్ డోర్ యూనిట్ తయారు చేశారు. మండుటెండలో కూడా గదిని వేగంగా చల్లపరిచేలా ఈ ఏసీ ని డిజైన్ చేశారు. రూమ్ లో ఎక్కడ బిగించుకున్న నాలుగు మూలల గాలిని సమానంగా విస్తరింపజేసేలా ఎయిర్ ఫ్లోర్ సిస్టమ్ ని అమర్చారు.
అలాగే రాత్రి సమయాలలో ఎక్కువగా ఉపయోగించే వారికి కంప్రెసర్ పనితీరు కూడా చాలా స్థిరంగా ఉండేలా తయారు చేశారు. ముఖ్యంగా కరెంటు బిల్లు ఆదా చేసేలా ఒక సిస్టం ని ఇందులో అమర్చారు. కేవలం గదికి కావాల్సిన ఉష్ణోగ్రతకు చేరుకోగానే టెంపరేచర్ కంట్రోల్ ద్వారా కంప్రెసర్ లోడ్ కూడా తగ్గిపోతుంది. కూలింగ్, విద్యుత్ ఆదా వంటి వాటిలో జియో ఎసిలో ప్రత్యేకత. జియో ఏసీలో చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. సింపుల్ రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. వాతావరణానికి అనుగుణంగా కూలింగ్ మార్చుకోవడానికి మల్టిపుల్ కూలింగ్స్ కలవు. తక్కువ శబ్దంతో ఏసీ పనిచేస్తుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి కాపాడుకోవడానికి ఇన్బిల్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా కలదు.