"BSNL, అమెజాన్" ల...."బంపర్ ఆఫర్".

NCH Nch

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ – కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ తో కలిసి ఒక భారీ ఆఫర్ ని ప్రకటించాయి ఎయిర్టెల్ తరువాత ఈ విధానం అమలు చేసిన  టెలికం బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ఇంతకీ ఆ భారీ ఆఫర్ ఏమిటి అంటే..బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు వాడుతున్న కస్టమర్లకు ఏడాదిపాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తోంది.

 

ఈ ఆఫర్ ఎవరెవరికి వరిస్తుంది అంటే...రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్  లేదా రూ.745 ఆ పైన విలువ గల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లను యూజ్ చేస్తున్న వారికి వర్తిస్తుంది...అయితే ఈ ప్లాన్లను వాడేవారు బిఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను కస్టమర్లు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

వెబ్ సైట్ లో కనిపించే అమెజాన్ ఆఫర్ బ్యానర్ పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, సర్కిల్ ను ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపిని కన్ఫార్మ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ యాక్టివేట్ అవుతుంది.. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్ ప్రకటించడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారు ఎంతో మంది ఈ సేవలని వినియోగించుకుంటున్నారని తెలిపింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: