"సింగల్ క్లిక్" తో వాట్సప్.."వీడియోని ఆడియో" గా మర్చేయచ్చు..!!!!

NCR

ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ ఉండకుండా మానదు. అందులో వాట్సాప్, పేస్ బుక్ వంటి ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.  అయితే యువత ఎక్కువగా వినియోగించేది వాట్సాప్ నే, ఎటువంటి సమాచారం అయినా సరే క్షణాలలో వెళ్ళిపోయే అధునాతన ఫీచర్స్ అందులో ఎక్కువగా ఉండటంతో యువత ఎక్కువగా వాట్సాప్ కి ఆకర్షితులు అయ్యారు. అయితే రోజుకో ఫీచర్ వాట్సప్ అందుబాటులోకి తెస్తూ మరింతగా యూజర్స్ ని పెంచుకుంటోంది.

 

వాట్సాప్ లో ఎన్నో రకాల షార్ట్ కట్స్ ఉంటాయి. టెక్స్ట్ బోల్డ్ చేయడం, రకరకాలుగా మార్చుకోవడం అన్నీ షార్ట్ కట్స్ ఉపయోగించి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి షార్ట్ కట్స్ ని ఉపయోగించి మన ఫోన్ లో ఉన్న వీడియోని ఆడియోగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

 

వాట్సాప్ ఓపెన్ చేసిన తరువాత చాట్ విండో ఓపెన్ చేయాలి. టెక్స్ట్ బాక్స్ పక్కనే ఉన్న కెమెరా ఐకాన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మనకి ఆడియోగా కావాలని అనుకున్న వీడియో ని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో వచ్చిన తరువాత, టాప్ లో కార్నర్ లో ఉన్న పెన్సిల్ టూల్ మీద క్లిక్ చేస్తే కొన్ని కలర్స్ కనిపిస్తాయి, వాటిలో ఎదో ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకుని వీడియో పై రెండు వేళ్ళతో ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ వీడియో బాక్స్ లో డిస్ప్లే అవుతుంది. వెంటనే సెండ్ బటన్ ప్రెస్ చేస్తే అది ఆడియోగా కనెక్ట్ అవుతుంది. ఇది మీరు కూడా ట్రై చేసి సక్సెస్ అవ్వండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: