ఇంట్లోకి వచ్చిన దొంగ.. కానీ ఒక్కసారిగా కేకలు వేస్తూ పారిపోయాడు.. ఏం జరిగిందంటే?
తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది అంటే చాలు చివరికి చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో దొంగలు చోరీలకు పాల్పడేందుకు ఒక్కొక్కరు ఒక్కో దారిని వెతుక్కుంటున్నారు. కొంతమంది ఇళ్లల్లో చోరీలు చేస్తుంటే.. ఇంకొంతమంది దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. మరి కొంతమంది ఇంట్లో మనుషులు ఉన్నారు అని తెలిసినప్పటికీ కూడా ఇక అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి ఇంట్లో వాళ్ళను బెదిరించి మరి ఇలా చోరీలు చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని సార్లు దొంగలకు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక దొంగకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
ఇంట్లో మనుషులు ఉన్నారు అని తెలిసినప్పటికీ.. ఒక దొంగ బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని తలుపులు బద్దలు కొట్టాడు. తీరా తలుపు తీసిన కాసేపటికే అక్కడి నుంచి కేకలు పెడుతూ బయటికి పరుగులు పెట్టాడు. సాధారణంగా ఒక దొంగ తలుపులను బదులు కొడుతుంటే ఇంట్లో వారు భయాందోళనకు గురవుతారు. కానీ ఇక్కడ మాత్రం ఇంట్లో వాళ్ళు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఏకంగా దొంగ డోర్ బద్దలు కొట్టిన వెంటనే మరుగుతున్న నీటిని ఆ దొంగ పై చల్లారు. దీంతో వామ్మో వాయ్యో అనుకుంటూ ఇంట్లో కి వెళ్లి చోరీ చేయాలనుకున్న దొంగ.. బయటికి పరుగులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.