విజయం మీదే : ఈ లక్షణాలు మీలో ఉంటే విజయం మీ సొంతం
ప్రతి ఒక్కరూ జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. కానీ కొందరు మాత్రమే పట్టుదలతో శ్రమించి లక్ష్యాలను సాధించి విజయాన్ని అందుకుంటారు. భారతీయ చరిత్రకారుడు చాణిక్యుడు కొన్ని లక్షణాలు ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారని చెప్పారు. ఈ లక్షణాలు ఉంటే జీవితంలో కొన్నిసార్లు విజయం సాధించడం ఆలస్యమైనా చివరకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
విజయవంతమైన వ్యక్తుల్లో ఉండాల్సిన ముఖ్య లక్షణం ఎదుటివారు కొన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడినా విమర్శలు చేసినా కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి. విజయం సాధించే క్రమంలో పొరపాటు జరిగితే ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ సమయాన్ని వృథా చేయకుండా ముందడుగు వేయాలి. జీవితంలో అక్రమంగా డబ్బు, అధికారం సంపాదించినా భవిష్యత్తులో దానికి తగిన విధంగా క్రూరమైన ముగింపు ఉంటుంది.
జీవితంలో ఎల్లప్పుడూ విలువలను, సిద్ధాంతాలను నమ్ముకొని ఆత్మీయులను మోసం చేయకుండా డబ్బు, అధికారం సంపాదించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి విజయం సాధించే దిశగా ముందడుగు వేయాలి. విజయం సాధించటంలో ఎదురయ్యే ఆవాంతరాలను అనుకూలంగా మార్చులని లక్ష్యాలు సాధించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేయాలి. మన సామర్థ్యంపైనే ఎప్పుడూ దృష్టి పెట్టాలి తప్ప ఇతరుల నుండి మెప్పు పొందడానికి ప్రయత్నించకూడదు. శత్రువులు ఎప్పుడూ వెనక్కు లాగటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉంటే మీ విజయాన్ని ఆపటం ఎవరి తరం కాదు.