విజయం మీదే: కరోనాపై విజయం సాధించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ భారత్ లో 1397 కేసులు నమోదు కాగా వీరిలో 35 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 8,24,000 మంది కరోనా భారీన పడగా మృతుల సంఖ్య 40,000గా ఉంది. రోజురోజుకు కరోనా విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించి... కొన్ని పనులు చేస్తే కరోనాపై విజయం సాధించడం కష్టమేమీ కాదు.
కరోనా భారీన పడకుండా ఉండాలంటే పూర్తిగా ఇంటికే పరిమితం కావడం మంచిది. వైరస్ ఎక్కడ ఎలా సోకుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి కరోనా కట్టడి అయ్యే వరకు పూర్తిగా ఇంటికే పరిమితం కావడం ఉత్తమం. అత్యవసర పరిస్థితులు, ఇతర కారణాల వల్ల బయటకు వెళ్లాల్సి వచ్చినా ముందుగానే ఒక జాబితా తయారు చేసుకొని అన్ని పనులు ఒకేసారి పూర్తి చేసుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా మాస్క్ ఉపయోగించాలి.
ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిని కొంతకాలం ఇంటికి ఆహ్వానించకపోవడం.. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి దూరంగా ఉండటం మంచిది. ఏవైనా కొత్త వస్తువులను తాకే ముందు శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా సోకకుండా జాగ్రత్త పడవచ్చు. జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సంబంధిత లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని వెంటనే సంప్రదించి కరోనా సోకిందో లేదో నిర్ధారించుకోవాలి.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple