విజయం మీదే : సరైన ప్రణాళికతో శ్రమిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం
ప్రతి మనిషికి సక్సెస్ అవసరం. ఏ పనిలోనైనా మనం విజయం సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా నిర్వహించే పనుల వల్ల మాత్రమే సక్సెస్ సాధ్యమవుతుంది. ఎవరైతే ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారో వారు లక్ష్యం కోసం మాత్రమే కృషి చేస్తారు. ప్రణాళిక లేకుండా ఉంటే మన మనస్సులోకి ఏది వస్తే ఆ పనిని చేస్తాం. సంపూర్ణ జీవితానికి పక్కా ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి. సరైన ప్రణాళిక ఉంటే మాత్రం ఏ పనిలోనైనా విజయం సాధించటం సాధ్యమతువుంది.
మనిషి ప్రతిరోజూ వీలైనంత సమయం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. ప్రతిరోజూ మనకు వేల సంఖ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు వచ్చే ఆలోచనలలో 10 శాతం పాజిటివ్ ఆలోచనలు ఉంటే 90 శాతం నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఒకే ఆలోచన పదే పదే మదిలో గుర్తుకు వస్తూ ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు మనస్సును తొలిచేస్తూ ఉంటే ప్రాణాయామం, ధ్యానంతో వాటిని జయించవచ్చు.
మన పాజిటివ్ ఆలోచనలకు స్పష్టమైన రూపం వస్తే అదే లక్ష్యం. ప్రతి ఒక్కరికీ జీవితంలో పైకి ఎదగాలని ఉంటుంది. కానీ ఎలా ఎదగాలో తెలీదు. ఎదగటానికి సరైన గైడెన్స్ ఇచ్చేవారు ఎవరూ ఉండరు. మనకు ఏ మార్గం గమ్యానికి చేరుస్తుందో తెలిపే సరైన ప్రణాళిక కావాలి. ప్రతి ఒక్కరూ జీవితంలో గడచిపోయే సమయం గుర్తురాదని గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో సమయాన్ని మాత్రమే తిరిగి సంపాదించుకోవడం సాధ్యం కాదు.
చాలామంది బాల్యంలోనే గొప్పగొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటారు. కానీ ఎదిగే కొద్దీ ఆ లక్ష్యాలను మనం మరిచిపోతూ ఉంటాం. ఆత్మవిశ్వాసం తగ్గితే ఆశలపై ఆకాంక్ష తగ్గుతుంది. జీవితంలో ఏదైనా సమస్య వస్తే మార్గాన్ని ధైర్యంగా సగర్వంగా ఎంచుకోవాలి. బాల్యంలో ఎలా ఆలోచించారో అదే విధంగా ఆలోచించాలి. ఏ రంగం ఇష్టమో ఆ రంగాన్ని నిర్ణయించుకుని ఎదగడానికి ప్రయత్నం చేస్తే విజయం తప్పక మీ సొంతమవుతుంది.