విజయం మీదే : కఠోర దీక్ష, పట్టుదల ఉంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

ప్రతి మనిషి ప్రతిరోజూ సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విజయం అనే పదం వినగానే కొంతమంది సంతోషపడితే మరికొంతమంది ఆ పదం వినగానే భయాందోళనకు గురవుతూ ఉంటారు. వారిపై వారికే నమ్మకం లేకపోవడం వల్ల తాము జీవితంలో సక్సెస్ కాలేమని అనుకుంటూ ఉంటారు. మరి అందరూ సక్సెస్ కావడం సాధ్యమా...? అంటే సాధ్యం కాదనే చెప్పాలి. పది ఉద్యోగాల కోసం వేల మంది పోటీ పడుతున్న కాలం ఇది. 
 
మరి విజయం సాధించాలంటే ఏం చేయాలి....? అనే ప్రశ్న మనలో చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. యువతలో చాలామంది ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. సక్సెస్ కోసం రోజులో 20 గంటలు శ్రమించేవారు చాలా మందే ఉన్నారు. శ్రమించకుండా విజయం సొంతం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే వారికి సక్సెస్ ఎప్పటికీ సొంతం కాదు. కఠోర దీక్ష, పట్టుదల ఉంటే మాత్రమే విజయం సొంతమవుతుంది. 
 
విజయసాధనలో అతి ముఖ్యమైనది లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం. ఒకటి రెండు రోజులు ప్రయత్నించి విజయం సాధించాలని అనుకుంటే సక్సెస్ కావడం కష్టం. లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనంత మాత్రాన కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటే ఎన్నో ఓటములు చవిచూసిన వారు కూడా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం దిశగా ముందడుగు వేస్తే విజయం సొంతమవుతుంది. 
 
దీక్ష, పట్టుదల లాంటి లక్షణాలు మనల్ని విజయానికి వేగంగా దగ్గర చేస్తాయి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ముందడుగులు వేస్తూ శ్రమిస్తే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. అలా కాకుండా ఎవరైతే లక్ష్యం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారో వారు సక్సెస్ ను సులభంగా అందుకోలేరు. మనలోని శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకొంటూ లక్ష్యసాధన కోసం ఎక్కువ కృషి చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: