విజయం మీదే : అపజయాలు ఎదురైనా విశ్రమించకుండా శ్రమిస్తే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

సక్సెస్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి కెరీర్ లో ముందుకు వెళ్లాలన్నా, వెనుకడుగు వేయాలన్నా అది సక్సెస్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి సక్సెస్ కావడం ఎలా...? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. కొందరు తొలి ప్రయత్నంలోనే ఎంచుకున్న లక్ష్యాలను సాధిస్తే మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ ను సొంతం చేసుకోలేరు. సక్సెస్ లేనిదే మనిషి జీవితం పరిపూర్ణం కాదు. 
 
జీవితంలో ఎవరైతే సరైన ప్రణాళికతో ముందడుగులు వేస్తారో వారు సక్సెస్ అవుతారు. ప్రణాళిక లేకుండా సక్సెస్ సాధించడం ఎప్పటికీ సాధ్యం కాదు. చాలామంది తొలి ప్రయత్నంలో విజయం సొంతం కాకపోతే ఢీలా పడిపోయి నిరాశానిస్పృహలకు లోనవుతారు. తాము ఎప్పటికీ సక్సెస్ కాలేమని... తమకు అదృష్టం లేదని పిచ్చిపిచ్చి ఆలోచనలతో సమయం వృథా చేస్తూ ఉంటారు. నెగిటివ్ ఆలోచనలతో కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు. 
 
ఎవరైతే అపజయాలు ఎదురైనా విజయం సాధిస్తామనే నమ్మకంతో ముందడుగులు వేస్తారో వారికి విజయం తేలికగా సొంతమవుతుంది. భవిష్యత్తు కోసం సరైన ప్రణాళిక వేసుకుని లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకంతో కృషి చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. సాధన చేయడం ద్వారా మాత్రమే విజయం సమకూరుతుంది. మన జీవితంలో దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలేము. అందువల్ల సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే విజయం తప్పక సొంతమవుతుంది. 
 
కెరీర్ కోసం శ్రమిస్తే మాత్రమే కన్న కలలను నిజం చేసుకోవడం సాధ్యమవుతుంది. చాలామంది తమపై తమకు ఉండే అతినమ్మకం వల్ల కూడా విజయానికి దూరమవుతూ ఉంటారు. ప్రయోజనకరమైన కలలు కని.... అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుని.... లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా విశ్రమించకుండా కృషి చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. జీవిత ప్రణాళికకు ఒక రూపం ఇచ్చి అభిరుచులకు అనుగుణంగా ప్రణాళికను రచిస్తే కెరీర్ లో సక్సెస్ కావడం సులభమే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: