విజయం మీదే : కాలం విలువ తెలుసుకుంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న పనిలో సక్సెస్ సాధించాలని నిరంతరం పరితపిస్తుంటారు. మరి సక్సెస్ సాధిస్తారా...? లేదా...? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్లకు ఆలస్యంగానైనా విజయం సొంతమవుతుంది. అలా కాకుండా ఎవరైతే సమయం విలువ తెలుసుకోకుండా విలువైన కాలాన్ని వృథా చేస్తారో వారికి విజయం ఎప్పటికీ సొంతం కాదు. కాలం విలువ తెలుసుకున్న వారు మాత్రమే జీవితంలో ఏదైనా సాధించగలరు. 
 
జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు కానీ గడిచిన కాలాన్ని మాత్రం వెనక్కు రప్పించలేం. అందువల్ల మనకున్న సమయాన్ని వృథా చేయకుండా నిరంతరం సక్సెస్ కోసం కష్టపడాలి. ప్రణాళికబద్ధంగా నిర్వహించే పనుల వల్లనే ఏ మనిషైనా విజయం సాధించటం సాధ్యమవుతుంది. మనం ఎంచుకున్న లక్ష్యం కోసం సరైన ప్రణాళికను రూపొందించుకుని సక్సెస్ కోసం ప్రయత్నించాలి. గెలుపోటముల గురించి ఆలోచించకుండా మన వంతు ప్రయత్నం చేయాలి. 
 
మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో పైకి ఎదగాలనుకుంటారు. ఎలా ఎదగాలో తెలియదు. సరిగ్గా గైడ్‌ చేసే వారు దొరకరు. ఈ సమయంలోనే ఎటువైపు వెళ్ళాలో తెలియజెప్పే దిక్సూచి కావాలి. ఏ మార్గం గమ్యానికి చేరుస్తుందో తెలిపే రోడ్డు మ్యాప్‌ కావాలి. లక్ష్యాన్ని ఎంచుకున్న తరువాత దానిని సాధించడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి. అనవసర వ్యాపకాల కోసం విలువైన సమయాన్ని వృథా చేయకూడదు. 
 
మనం ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం అదే స్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు తొలి ప్రయత్నంలో ఓటమిపాలైనా మలి ప్రయత్నంలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. గెలుపోటములను మనం ఒకే విధంగా స్వీకరించాలి. ఈ ప్రపంచంలో దేన్నైనా సంపాదించుకోవచ్చు గానీ గడిచిపోయిన సమయాన్ని కాదనే స్పృహ ఉండాలి. ఈ విషయాలను గుర్తుంచుకొని సక్సెస్ కోసం ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: