విజయం మీదే : సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే కెరీర్ లో విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మనలో కొంతమంది తక్కువ సమయంలోనే మంచి ఉద్యోగం సాధించి కెరీర్ లో స్థిరపడుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా సక్సెస్ సొంతం కావడం లేదని నిరాశ చెందుతూ ఉంటారు. జీవితంలో విజయం సాధించాలంటే సరైన ప్రణాళికను రూపొందించుకొని కెరీర్ విషయంలో ముందడుగులు వేయాలి. కెరీర్ లో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటే ఆ తరువాత ఎంత బాధ పడినా ఫలితం ఉండదు.
 
మనం ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుని విజయం సాధించాలని అనుకున్న సమయంలో మొదట వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి. మనల్ని మనం విజయం సాధించే చివరి నిమిషం వరకు మెరుగుపరచుకుంటూ ఉండాలి. ఒక క్రమ పద్ధతిలో కెరీర్ లో సక్సెస్ కోసం ప్రయత్నిస్తే విజయం సాధించడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. కెరీర్ లో విజయానికి సాధించాలని అనుకున్న వాళ్లు సక్సెస్ సాధించడానికి అవసరమైన సమాచారం సేకరించాలి.
 
ఎప్పటికప్పుడు కెరీర్ కు అవసరమైన సమాచారం తెలుసుకుంటూ అప్ డేట్ అవుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మన వ్యక్తిత్వంతో పాటు అవకాశాలు సైతం మెరుగుపడతాయి. ఈ భూప్రపంచంలో చాలామంది అసాధ్యాలను సైతం సుసాధ్యం చేశారు. వాళ్లు సరైన విధంగా అంచనా వేయడమే సక్సెస్ కు అసలు కారణం. అందువల్ల మన బలాలు, బలహీనతలపై అవగాహన కలిగి ఉండే సక్సెస్ కోసం ప్రయత్నిస్తే సులువుగా విజయం సాధించగలుగుతాం.
 
కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా చాలామంది భయపడుతూ ఉంటారు. మొదట మనలోని భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టాలి. మన మాటలు ఎల్లప్పుడూ సూటిగా, స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు స్పష్టంగా ఉంటే మాత్రమే ఎంచుకున్న పనిలో సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. సూటిగా మాట్లాడటం వల్ల ఇతరులకు కూడా మనపై సదభిప్రాయం ఏర్పడుతుంది. ఈ విధంగా శ్రమిస్తే సక్సెస్ సాధించడం సాధ్యమే. ఇతరులు సైతం మనపై విశ్వాసాన్ని కలిగి ఉండి మన విజయం కోసం శ్రమిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: