కాలీగా ఉంటే కాదు... గెలవాలనే కసి ఉంటే చదవండి... !
తెలిసిన దారి ని వదిలేసి ఇక్కడే ఎక్కడో షార్ట్ కట్ దారి ఉంది అనుకొని అక్కడక్కడే తిరిగే బదులు ఏదొక దారిలో మన ప్రయాణాన్ని సాగించడం మేలు కదా....! అందుకే మహాకవి శ్రీ శ్రీ ఇలా అన్నారు. "పదండి ముందుకు!పదండి త్రోసుకు!పోదాం పోదాం, పైపైకి!ఎముకులు క్రుళ్ళిన,వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి!నెత్తురు మండే,శక్తులు నిం, డే,సైనికులారా! రారండి!“హరోం! హరోం హర!హర! హర! హర! హర!హరోం హరా!” అని కదలండి!" అని అంటాడు మహాకవి శ్రీ శ్రీ ...అంటే మనసులో ఏదైనా అనుకుంటే అది సాధించేవరకూ నిద్రపోవద్దు, అన్ని ఉండి కూడా కష్టపడటానికి ఇష్టపడని బద్దకస్తులు వల్ల ఏమి ఉపయోగం లేదని కవి హృదయం.
అయితే ఇలాంటివి చదివినా హాఆ అలాగే రాస్తారు లే వాళ్ల వరకూ వస్తే తెలుస్తుంది అని కొట్టిపారేసే వాళ్ళూ ఉన్నారనుకోండి.. అయితే నిజానికి అదృష్టం అని అనేకంటే అదొక అవకాశం అని ముందుకుపోవాలి... అందుకే "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి....ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి" అని సిరివెన్నెల సీతారామశాస్త్రి "పట్టుదల" సినిమాలో రాసిన పాటను ఒక్కసారి వినండి....
"సాహసం నా పదం...రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా" అని పాత మహర్షి సినిమాలో వచ్చిన పాట కూడా నిదాన మెదళ్లను పరుగులెత్తించేలా ఉంటుంది. ఎంతలా అంటే ఒంటరిగా ఎడారిలో వదిలేసినా ఆ పాట లు వింటూ వెళ్లిపోవచ్చు. మొత్తంగా చెప్పేది ఏంటంటే... తియ్యటి పళ్ళు ఇచ్చే చెట్టుకే ఎక్కువ రాళ్ళ దెబ్బలు తగులుతాయి....అలాంటి దెబ్బలన్నింటినీ ఓర్చుకొని ముందుకెళ్లేవాడే గెలుస్తాడు...ఎందుకంటే 'ఓటమి ని రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు....ఆల్ ది బెస్ట్..