విజయానికైనా .... అపజయానికి అయినా మీరే కారణం...?
మీరు చేసే పని యొక్క విధానమే నీకు ప్రతిఫలంగా లభిస్తుంది. ఒకవేళ మీరు కనుక విద్యార్థి అయితే కొన్ని అలవాట్లు తప్పకుండా మానుకోవాలి. ముందుగా టీవీ చూడడం తప్పక మానుకోవాలి. మీరు ఎప్పుడైనా విన్నారా ధనవంతులు మరియు విద్యావంతులు ఎప్పుడైనా మేము టీవీ చూస్తూ సమయం గడుపుతూ ఉంటామని, ఎప్పుడూ విని ఉండరు, ఎందుకంటే వారు టీవీ చూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోరు. ఎందుకంటే వారు విలువైన సమయాన్ని టీవీ చూస్తూ వృధా చేసుకోవడానికి ఇష్టపడరు. మనలో చాలామంది అనవసర వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా డబ్బును వృధా చేయడం జరుగుతుంది.
ఆ వస్తువులను ఇతరులకు గొప్పగా చూపించుకోవడానికి వారి వద్ద ఉన్న ధనాన్ని మొత్తం అవసరం లేని వస్తువులపై ఖర్చు చేస్తారు. అందువలన వారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. ధనవంతులైన వారిని చాలావరకు గమనిస్తూ ఉండండి వారు అవసరమైన వస్తువుల పైన వారి ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది అభివృద్ధి చెందాలంటే ఎప్పుడైనా సరే వృధా ఖర్చులు అనేవి చేయకూడదు. పైన తెలిపిన ఈ ముఖ్యమైన విషయాలను కనుక మీరు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.